Home  »  TV News  »  Illu Illalu Pillalu: శ్రీవల్లి కుట్రలు ఫలిస్తున్నాయా.. ప్రేమ జీవితంలో చీకటి రోజులు!

Updated : Mar 18, 2026

స్టార్ మాలో పాపులర్ అవుతున్న 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్. ఇప్పుడు అత్యంత కీలకమైన మలుపుకు చేరుకుంది. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-421 లో.. అమూల్య, విశ్వల పెళ్లి చుట్టూ తిరుగుతున్న ఈ డ్రామాలో ఊహించని నిజాలు బయటపడటంతో రామరాజు కుటుంబం ఒక్కసారిగా షాకైంది. అసలు అమూల్య మెడలో తాళి వెనుక ఉన్న రహస్యం ఏంటో రివీల్ అవ్వడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. తాజా ఎపిసోడ్ ప్రకారం, అమూల్యకు విశ్వకు పెళ్లి జరగలేదన్న సత్యం అందరికి తెలిసిపోయింది. రామరాజు ఆమెను తిరిగి ఇంటికి తీసుకురాగా, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికే మెడలో తాళి వేసుకున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. దీని వెనుక ప్రేమ ఇచ్చిన సలహా ఉందని తెలియడంతో ప్రేమపై ధీరజ్ కోపంగా ఉంటాడు.

అమూల్యను కిడ్నాప్ చేసిన తర్వాత విశ్వ వేసిన ప్లాన్ నుండి తప్పించుకోవడానికే తను అలా చేశానని ఆమె ఎంత చెప్పినా ధీరజ్ మాత్రం ప్రేమపై కోపంగా ఉంటాడు. మరోవైపు విశ్వ ఇంట్లో కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రేవతి తన కొడుకు ప్రవర్తనను తప్పుబడుతూ చేయి చేసుకోగా, సేనాపతి ఆమెను అడ్డుకుంటాడు. అయితే ఈ కథలో అసలు సూత్రధారి ప్రేమేనని విశ్వ చెప్తాడు. పెద్దావిడ మాత్రం అమూల్యకు, విశ్వకు పెళ్లి చేయాలని అంటుంది.

ఇది భద్రవతికి ఏమాత్రం నచ్చకపోవడంతో తను పెద్దావిడపై సీరియస్ అవుతుంది. అయితే అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే.. ధీరజ్, ప్రేమల మధ్య పెరుగుతున్న దూరం. ప్రేమను అసలు పెళ్లి చేసుకునే వాడినే కాదని, కళ్యాణ్ లాంటి వాడే ఆమెకు కరెక్ట్ అంటూ ధీరజ్ అన్న మాటలు ప్రేమ మనసుని గాయపరుస్తాయి. నర్మద ఎంత చెప్పినా వినకుండా ప్రేమపై కోపంగా ఉన్న ధీరజ్ ని చూస్తుంటే ప్రేమ, ధీరజ్ ల బంధం ప్రమాదంలో పడ్డట్టే కనిపిస్తోంది.


ఈ గొడవలను చూసిన శ్రీవల్లి తన తల్లి భాగ్యం, తండ్రి ఆనందరావుకి చెప్తుంది. దాంతో భాగ్యం, ఆనందరావు ఇద్దరు కలిసి ప్రేమ జీవితం నాశనమవుతోందనే సంతోషంతో డ్యాన్స్ వేస్తారు. అమూల్య జీవితం ఏమవుతుంది? ధీరజ్ మనసు మారుతుందా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కథనం ఇప్పుడు ఎమోషనల్ అండ్ రివెంజ్ డ్రామాగా మారుతుండటంతో టీఆర్పీ రేటింగ్స్ పెరిగే అవకాశం ఉంది. రాబోయే ఎపిసోడ్లలో రామరాజు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడో చూడాలి. మరిన్ని ఆసక్తికరమైన సీరియల్ అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను చూస్తూనే ఉండండి. ధీరజ్ ప్రవర్తన కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని తెలపండి!






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.