Home  »  TV News  »  Illu Illalu Pillalu: వనజకి డబ్బులు ఇచ్చేసిన సాగర్, నర్మద.. వాళ్ళిద్దరూ షాక్! 

Updated : Feb 24, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu Illalu Pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-402 లో.... నర్మద, సాగర్ కలిసి బంగారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకొవాలని మార్వాడి షాప్ కి వెళ్తారు. వెళ్లి గోల్డ్ మొత్తం అతని ముందు పెట్టి డబ్బు ఎంత వస్తుందో అడుగుతారు. అన్నింటికి కలిపి తొమ్మిది లక్షలు మాత్రమే వస్తుందని అతను అనగానే మాకు ఇరవై లక్షలు కావాలని అడుగుతారు. మిగతా పదకొండు లక్షలకి ఇంట్రెస్ట్ ఇస్తామని రిక్వెస్ట్ చేస్తారు.

దాంతో మీరు రామరాజు గారి అబ్బాయి కదా.. మీరు శ్రీనివాసరావు అమ్మాయి కదా.. మీ మీద నమ్మకంతో డబ్బు ఇస్తానని డాక్యుమెంట్స్ పై మార్వాడి సంతకం తీసుకొని మొత్తం ఇరవై లక్షల డబ్బు ఇస్తాడు. అదంతా ఆనందరావు చూసి ఈ విషయం ఎలాగైనా భాగ్యానికి చెప్పాలని అనుకుంటాడు.

మరొక వైపు ప్రేమ, ధీరజ్ ఇంటికి వస్తారు. ధీరజ్ కోపంగా లోపలికి వెళ్తాడు. తన వెనకాలే ప్రేమ వెళ్తుంది. ఏంట్రా నీకు ఉద్యోగం ఇచ్చిన అతన్ని కొట్టడానికి వెళ్తున్నావ్.. మనం ఒకరికి ఎప్పుడు సంజాయిషీ కాకుండా సమాధానం చెప్పేలా ఉండాలి. నువ్వు ఇక్కడే ఆగిపోతావా.. నువ్వు ఏది సాధించాలి అనుకున్నావో అది సాధించమని ధీరజ్ ని ప్రేమ మోటివేట్ చేస్తుంది. వాళ్ళు మాట్లాడుకునేది శ్రీవల్లి చాటుగా వింటుంది. అప్పుడే ప్రేమ వచ్చి.. నీ బుద్ధి ఇక మారదా అని కోప్పడుతుంది. 

ఆ తర్వాత నర్మద, సాగర్ ఇద్దరు వనజ ఇంటికి వెళ్లి డబ్బు ఇస్తారు. లోపలికి రండి అని వనజ అనగానే.. మేం రాము.. మీరు మా మావయ్యని ఇష్టం వచ్చినట్లు తిట్టారు. అప్పుడే మీపై ఉన్న గౌరవం పోయింది. నువ్వు కాలేజీలో ఎవరిని ప్రేమించలేదా అని వనజ వాళ్ళ అబ్బాయిని నర్మద అడుగుతుంది. అతను సైలెంట్ గా ఉండడంతో.. చూసారా మీ అబ్బాయి కూడా ప్రేమించాడు.. పిల్లలు చేసిన తప్పుకి పెద్దవాళ్ళని మాటలు అనడం కరెక్ట్ కాదు.. మా మావయ్య ఎప్పుడు తప్పు చెయ్యడని వనజకి నర్మద కౌంటర్ ఇస్తుంది. పదా సాగర్ మా ఇంటికి వెళ్ళు అక్కడ తేల్చుకోవల్సినవి చాలా ఉన్నాయని సాగర్ తో నర్మద అంటుంది.

ఆ తర్వాత భాగ్యం దగ్గరికి శ్రీవల్లి వచ్చి.. ఆ ధీరజ్ ఎవరితోనో గొడవ పెట్టుకున్నాడంట అని చెప్తుంటే అప్పుడే భాగ్యంకి ఫోన్ వస్తుంది. నేను ఫోటో పంపినా కదా అందులో ఉన్న అతను ఎవరో కనుక్కోమన్నాను కదా అని భాగ్యం అనగానే.. కనుక్కున్నాను, అతను జాబ్ లు ఇప్పించే బ్రోకర్ అని ఆవిడ చెప్తుంది. బ్రోకర్ తో సాగర్ కి పనేంటి అని భాగ్యం అంటుంది.

అప్పుడే ఆనందరావు వచ్చి నర్మద నగలు తాకట్టు పెట్టి ఇరవై లక్షలు తీసుకొని వనజకి ఇచ్చారని చెప్పగానే భాగ్యం, శ్రీవల్లి షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.