![]() |
![]() |

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఫ్రెండ్ షిప్ డేని సెలెబ్రేట్ చేస్తూ ఈ షో రాబోతోంది. ఇందులో కొరియోగ్రాఫర్ శేఖర్ మాష్టర్ - రఘు మాష్టర్ , ధన్ రాజ్ - బలగం వేణు, నిఖిల్ విజయేంద్ర సింహ - సుప్రీతా, రవికృష్ణ - నవ్య స్వామి వచ్చారు. ఇక వీళ్ళ బాండింగ్ గురించి ఒకరి గురించి ఒకరు చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఇక బలగం వేణు - ధనరాజ్ జోడి ఐతే వాళ్ళ బాండింగ్ అంతకు మించి అన్నట్టుగా ఉంది. "అరేయ్ లైఫ్ లో ఇంకో 5 నిమిషాల్లో చచ్చిపోతావ్ ..ఆ 5 నిమిషాలు ఎవరితో గడపాలని అనుకుంటావ్ అనే పరిస్థితి ఎదురైతే మాత్రం నేను ధనరాజ్ పేరు చెప్తా.." అన్నాడు వేణు. "సరే చెప్పండి క్రీస్తు పూర్వం ఇప్పట్లో మొదలయ్యింది మీ స్నేహం " అని అడిగింది వీళ్ళను. "నిజానికి క్రీస్తు పూర్వం లాగే అనిపిస్తుంది తలుచుకుంటే. 2003 లో నటులుగా స్టార్ట్ చేసాం. ఇద్దరం సేమ్ గా చేసుకుంటూ వచ్చాము. సినిమాలైనా, షోస్ ఐనా చివరికి డైరెక్టర్స్ గా ఐనా కూడా ఇద్దరం డైరెక్టర్స్ అయ్యాము. " అని చెప్పాడు బలగం వేణు.
ధనరాజ్ జై మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత జగడం మూవీ ద్వారా మంచి పేరు సంపాదించుకున్నాడు. జబర్దస్త్, అదిరింది లాంటి కామెడీ షోస్ ద్వారా ఆడియన్స్ ని నవ్వించాడు. అలాగే బిగ్ బాస్ సీజన్ 1 కి కంటెస్టెంట్ గా వెళ్ళాడు. యాక్టర్ గా, డైరెక్టర్ గా రామం రాఘవంని అద్భుతంగా తీసి నటించాడు. అలాగే బుజ్జి ఇలారా మూవీలో కూడా ఆయన నటన అద్భుతంగా ఉంటుంది. ఇలా బలగం వేణు ఐతే బలగం పేరుతో సినిమా తీసి దాన్నే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు. ఇప్పుడు ఎల్లమ్మ మూవీతో రాబోతున్నాడు. వేణు కూడా జై మూవీలో ఒక కమెడియన్ గా చేసాడు. తర్వాత మున్నా, పిల్ల జమిందార్, ఫిదా, పక్కా కమర్షియల్ లాంటి మూవీస్ లో నటించి మెప్పించాడు. ఇక రుద్రమదేవి మూవీకి వేణు డైలాగ్స్ సీన్స్ రాసాడు.
![]() |
![]() |