Home  »  TV News  »  Guppedantha Manasu : నీ తండ్రి స్థానంలో ఉండి అడుగుతున్నాను.. షాక్ లో మను!

Updated : Mar 27, 2024

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1034 లో..‌ అనుపమ దగ్గరికి దేవయాని వస్తుంది. దేవయాని తన ప్రశ్నలతో అనుపమని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మను నీ కొడుకు అంట కదా ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు.. మీరు ఎందుకు మాట్లాడుకోవడం లేదు.. అసలు నీ భర్త ఎవరు? పేరేంటి చెప్పాడం ఇష్టం లేదా.. ఎందుకు దూరంగా ఉన్నారంటు అనుపమకి దేవయాని చిరాకు తెప్పిస్తుంది. అది కాకుండా వేరే మాట్లాడండి అని చెప్పినా కూడా దేవయాని వినకుండా అలాగే విసిగిస్తుంది.

అప్పుడే వసుధార వచ్చి ఎందుకు అలా ఇబ్బంది పెడుతున్నారంటూ దేవాయనితో అంటుంది. అయినా వినకుండా అలాగే విసిగిస్తుంది. ఆ తర్వాత దేవాయనికి ఏంజిల్ కాఫీ తీసుకొని వస్తుంది. మీ మామయ్య ఎవరో మీ అత్తయ్య నీకైనా చెప్పిందా.. అసలు చెప్పట్లేదని ఏంజిల్ తో దేవయాని అంటుంది. అత్తయ్యకు ఇష్టం ఉంటే చెప్తారు కదా.. ఎందుకు అలా అడుగుతున్నారు మేడమ్ అని ఏంజిల్ అంటుంది. ఏదో మీ ఫ్యామిలీని లంచ్ కి పిలుద్దామని అనుకున్నానని దేవయాని అంటుంది. ఆ తర్వాత ధరణి వచ్చి శైలేంద్ర పై సెటైర్ వేస్తుంటుంది. ఆ తర్వాత దేవాయని వచ్చి.. శైలేంద్ర చెంప చెల్లుమనిపిస్తుంది. ఈ దెబ్బ వసుధారకి తగలాల్సిందని శైలంద్రతో దేవయాని అంటుంది. అక్కడికి వెళ్ళాను గానీ అసలు అనుపమ, మనుల మధ్య గొడవ గురించి అయితే తెలియలేదని దేవయాని అంటుంది.

ఆ తర్వాత ఏంజిల్, వసుధారలు కలిసి.. అనుపమ ఎందుకు నిజం దాస్తుందోనని మాట్లాడుకుంటారు. అత్తయ్య, మనులని చూస్తుంటే నువ్వు, రిషి గుర్తుకు వస్తున్నారు.. మీరు కూడా అలాగే నిజం దాచిపెట్టారు కదా అని వసుధారతో ఏంజిల్ అంటుంది. మరొకవైపు మనుని మహేంద్ర కలిసి.. అసలు అనుపమకి నీకు గొడవలేంటి? నీ తండ్రి స్థానంలో ఉండి అడుగుతున్నానని మహేంద్ర అనగానే.. మను షాక్ అవుతాడు. చెప్తే ఇంకా ఎక్కవ బాధపడతారని మను అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.