![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1097 లో.. రిషి ఉన్నాడు.. వస్తాడు.. ఏదో ఆధారాలు పట్టుకొని లేడని చెప్తే ఎలా? నన్ను నమ్మండి అని మినిస్టర్ తో వసుధార చెప్తుంది. ఇందులో పోలీస్ డిపార్ట్ మెంట్ కాదు. మీరు చెప్పిన కానీ నా నమ్మకం నాది అని వసుధార మీటింగ్ లో నుండి వెళ్లిపోతుంది. ఏంటి సర్ ఒక ఎండీ సీట్ లో కూర్చొని ఉన్న వాళ్ళకి ఎంత సహనం ఉండాలి. కానీ తను మన మాట కూడా వినట్లేదని మినిస్టర్ అంటాడు.. నేను తనతో మాట్లాడుతానని ఫణీంద్ర అంటాడు. మీరు ఏదైనా చేసుకోండి కానీ ఇలా ఉంటే కాలేజీ పాడవుతుంది. ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్ కాన్సల్ అయిందని తెలిసి మిషన్ ఎడ్యుకేషన్ ఏం నడిపిస్తారని.. వేరే కాలేజీలు మిషన్ ఎడ్యుకేషన్ మాకు ఇవ్వండంటూ ప్రపోజల్స్ వస్తున్నాయని చెప్పేసి మినిస్టర్ వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత వసుధార దగ్గరకి మను వెళ్తాడు. ఏంటి మను గారు సైలెంట్ గా ఉన్నారు.. మీరు కూడా రిషి సర్ లేడని అనుకుంటున్నారా.. ఇన్ని రోజులు నాకు సపోర్ట్ గా ఉంటారనుకున్న కానీ ఇలా చేస్తారనుకోలేదు అని వసుధార అనగానే.... నేను సైలెంట్ గా ఉంటుంది.. అసలు కాలేజీ ఎగ్జామ్స్ సెంటర్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఎవరు అని మను అంటాడు. ఇంకెవరు ఆ శైలేంద్రనే అని వసుధార అంటుంది. అదంతా శైలేంద్ర వింటుంటాడు. ఇప్పుడు వాళ్ళు కోపంగా ఉన్నారు. నేను వెళ్తే నన్ను ఇద్దరు తిడతారంటూ శైలేంద్ర వెనక్కి వెళ్లిపోతాడు. మరొకవైపు మహేంద్ర మినిస్టర్ అన్న మాటలు గుర్తుకుచేసుకుంటాడు అప్పుడే ఫణీంద్ర వచ్చి.. సాయంత్రం వసుధారని తీసుకొని ఇంటికి రా మాట్లాడాలని మహేంద్రకి ఫణీంద్ర చెప్తాడు. ఆ తర్వాత వసుధార దగ్గరికి మహేంద్ర వెళ్తాడు. మీరు కూడ నా మాటలు నమ్మడం లేదు కదా మావయ్య అని వసుధార అడుగుతుంది. లేదమ్మ ఎప్పుడు నీ మాట నేను నమ్ముతానని మహేంద్ర అంటాడు.
మరొకవైపు ఫణీంద్రకి ఎవరెవరో ఫోన్ చేసి.. కాలేజీ ఎగ్జామ్స్ సెంటర్ క్యాన్సిల్ అయిందంట అని అడుగుతారు. ఆ తర్వాత వసుధార, మహేంద్ర ఇద్దరు వస్తారు. ఎందుకు రమ్మని చెప్పారని వసుధార అడుగుతుంది. ఎండీ సీట్ నుండి తప్పుకొమ్మని చెప్తారా అని వసుధార అనగానే లేదమ్మ నీకు మాత్రమే అర్హత ఉందని ఫణీంద్ర అంటాడు. మరి దేని గురించి అని వసుధార అనగానే.. నువ్వు రిషి లేడన్నా విషయం నమ్మాలి.. నీకు మూడు నెలలు టైమ్ ఇచ్చాం. అది పూర్తి కావస్తుంది. కొంత సమయం మాత్రమే ఉందని ఫణీంద్ర అనగానే లేదు మావయ్య రిషి సర్ వస్తాడని వసుధార అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |