![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1087 లో....ఏంజిల్ , మనుకి ఎదరుగా కూర్చొని డిస్టబ్ చేస్తుంది. కాసేపటికి మనుని చూసి ఏంజిల్ కన్నుకొడుతుంది. ఇప్పుడేం చేసావంటూ మను అడుగుతాడు. ఏం చేసానో నువ్వే చెప్పమంటూ ఏంజిల్ అడుగుతుంది. నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు.. ఎందుకు నా లైఫ్ లోకి రావాలనుకుంటాన్నావ్.. నా జీవితంలో ఇక ఎవరికి స్థానం లేదని మను అంటాడు. నువ్వు వెళ్తావా నేను వెళ్లిపోవాలా అని మను అనగానే.. నేనే వెళ్తానంటూ ఏంజిల్ బయటకు వెళ్తుంది.
ఆ తర్వాత ఏంజిల్ వెళ్తుంటే వసుధార పిలిచి.. మనుపై నీ ఉద్దేశం ఏంటని అడుగుతుంది. ఎందుకు అలా అడుగుతన్నావని ఏంజిల్ అంటుంది. ఏం లేదు కాలేజీ అంటేనే ఇష్టం ఉండదు. ఇప్పుడు కాలేజీకి వస్తానంటున్నావ్.. అందుకని అలా అడిగానని వసుధార అంటుంది. పాపం మనుని చుస్తే జాలి వేస్తుంది. చిన్నప్పటి నుండి ఒక ఎమోషనల్ తో బాధపడుతున్నాడు.. ఆ బాధ.. ఆలోచన పోగొట్టాలని నేను ట్రై చేస్తున్నాను.. ఇలా ఉంటే మను ఆ విషయం గురించి ఆలోచించడు. అందుకే ఇలా మనుని ఇరిటేట్ చేస్తున్నానని ఏంజిల్ చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వసుధార, మహేంద్ర కలిసి అనుపమ వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వస్తారు. మీరైనా మను తండ్రి ఎవరో చెప్పండని పెద్దావిడని మహేంద్ర అడుగుతాడు. మను అంత ఇబ్బందిపడుతున్నా అనుపమ నిజం ఎందుకు చెప్పడం లేదు.. అసలు అనుపమని మోసం చేసింది ఎవరని మహేంద్ర అంటాడు అప్పుడే అనుపమ వస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నావ్ మహేంద్ర అని కోప్పడుతుంది. నా మాటని పక్కన పెట్టి అదే పనిలో ఉన్నావ్.. ఇప్పుడు ఏకంగా మా పెద్దమ్మ దగ్గరికే వచ్చావని అనుపమ అంటుంది. నేను కచ్చితంగా మను తండ్రి గురించి తెలుసుకుంటానని మహేంద్ర అనగానే.. వాడిని పాతికేళ్ళు పెంచిన తల్లి చెప్పడం లేదని పెద్దావిడ అనగానే అందరు షాక్ అవుతారు. పెంచిన తల్లి ఏంటని మహేంద్ర అనగానే.. అనుపమ టెన్షన్ గా కన్నతల్లి చెప్పట్లేదు.. నీకెందుకని అనుపమ అంటుంది. అసలు నువ్వు తల్లీవేనా కొడుకు అలా బాధపడుతుంటే.. ఎలా నిజం చెప్పకుండా ఉంటున్నావని మహేంద్ర అంటాడు.
అసలు నువ్వు ఎవరు మా జీవితాల్లోకి రావడానికి అని అనుపమ అంటుంది. నేను ఎవరో తెలియదా అంటూ మహేంద్ర అడుగుతుంటే.. పదండి మావయ్య అంటూ వసుధార అక్కడ నుండి తీసుకొని వెళ్తుంది.. అదేంటి మహేంద్రని ఆలా అన్నావని పెద్దావిడ అనగానే.. అలా అంటేనే ఆ విషయం గురించి ఆలోచించడని అనుపమ అంటుంది. మీరు ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించకండి అనుపమ గారు.. మను అంత బాధపడుతున్నా చెప్పట్లేదంటే కారణం ఉండే ఉంటుందని మహేంద్రతో వసుధార అంటుంది. మీరు ఇంటిదగ్గర ఉంటే ఇలాగే ఆలోచిస్తారు. ఇక కాలేజీకి రండీ అని వసుధార అనగానే.. నేను ఇప్పుడు బోర్డు మెంబెర్ ని కూడా కాదు.. ఎలా రావాలని మహేంద్ర అంటాడు. మళ్ళీ బోర్డు మెంబెర్ చేస్తాను.. పదండి అని వసుధార అనగానే.. సరే అని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |