![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1083 లో.... మనుతో ఏంజిల్ మాట్లాడాలని వస్తుంది. నీలో ఎలాంటి రియాక్షన్ ఉండదు ఎందుకని ఏంజిల్ అడుగుతుంది. మళ్ళీ రా అప్పుడు నీకు నచ్చిన ఎమోషన్ చూపిస్తానని మను అంటాడు. నువ్వు ఎప్పుడు ఇలాగే కోపంగా ఉంటావా అని ఏంజిల్ అడుగుతుంది. నేను నార్మల్ గానే ఉన్నానని మను అంటాడు. నువ్వు ఉండడమే ఇలా ఉంటావా అని ఏంజిల్ అంటుంది. చిరాకు తెప్పించకుండా ఎందుకు వచ్చావో చెప్పమని మను అంటడు.
ఆ తర్వాత నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని ఏంజిల్ అడుగుతుంది. ప్రేమించాను.. ప్రేమిస్తూనే ఉంటాను.. నాది వన్ సైడ్ లవ్ అంటాడు. దాంతో ఏంజిల్ షాక్ అవుతుంది. ఎవరు ఆ అమ్మయి అని ఏంజిల్ అడుగుతుంది. అమ్మాయి కాదు మా అమ్మ అని మను అంటాడు. నిన్ను ఎవరైనా ప్రపోజ్ చేసారా? అయిన చెయ్యడనికి నిన్ను చూస్తానే భయపడతారని ఏంజిల్ అంటుంది. మనుని ఏంజిల్ బావ అని ప్రేమగా పిలుస్తుంది... ఏంటి అలా పిలుస్తున్నావని మను అంటాడు. నువ్వు నాకు బావవి అవుతావు కావాలంటే ఫోన్ చేసి మీ అమ్మని అడుగమని ఏంజిల్ అంటుంది. కాసేపటికి ఏంజిల్ వెళ్లిపోతు.. కిందపడుతుంది. దాంతో ఏంజిల్ చెయ్యి పట్టుకొని మను లేపుతాడు. ముందు చూసుకొని నడవాలని మను అనగానే.. ఇంకెప్పుడు నిన్ను కలవనని ఏంజిల్ కోపంగా వెళ్ళిపోతుంది.
మరొకవైపు రిషి గురించి వసుధార బాధపడుతుంటే.. అప్పుడే మహేంద్ర వచ్చి రిషి వస్తాడని అంటాడు. రిషి రాడంటూ శైలంద్ర వాళ్ళింద్దరిని రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. వీళ్ళు ఆవేశంగా ఉంటేనే నాకు దొరుకుతారని శైలేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత మను దగ్గరికి శైలేంద్ర వెళ్లి.. నీ తండ్రి గురించి తెలుసుకున్నావా అంటూ తనని రెచ్చగొడతాడు. నిన్ను నా తమ్ముడిగా ధత్తత తీసుకుంటానని శైలేంద్ర అంటాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అక్కడే వసుధార కూడా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |