![]() |
![]() |

బిగ్ బాస్ ద్వారా ఆడియన్స్ కి దగ్గరైన వ్యక్తి డీమన్ పవన్ . అలాగే రీతుకు బాగా ఫ్రెండ్ ఐన పర్సన్ కూడా డీమన్ పవన్. వీళ్ళిద్దరూ ఎక్కడికైనా కలిసే వెళ్తారు. షాప్ ఓపెనింగ్స్ కి కానీ రీల్స్ కి కానీ షోస్ కి కానీ. చలామణది బిగ్ బాస్ నుంచి రాగానే అవకాశాలు లేవు అని ఛాన్స్ లు రావట్లేదని చెప్తారు. కానీ డీమన్ పవన్ కి అలా కాదు అవకాశాలు వస్తున్నాయి. ఆ ఆవకాశాలన్నిటిలో కూడా వాళ్ళ అమ్మను, అలాగే రీతుని ఇన్వాల్వ్ కూడా చేస్తున్నాడు.
రీసెంట్ గా డీమన్ పవన్, రీతూ చౌదరి కలిసి బంగారం అనే ఒక కవర్ సాంగ్ చేశారు. ఈ సాంగ్ ప్రోమో ఎలా అదిరిపోయిందో రీసెంట్ గా రిలీజ్ చేసిన సాంగ్ కూడా అదిరిపోయింది. యూత్ మొత్తానికి నచ్చే ఒక సాంగ్ ఇది. ఇందులో వీళ్ళ జోడికి మంచి మార్కులు పడ్డాయి. ఐతే ఈ సాంగ్ లో ప్రేమించుకున్న ఈ ఇద్దరినీ ఇంట్లోంచి గెంటేస్తారు. దాంతో ఇద్దరూ కలిసి వెళ్ళిపోతారు. ఇక డీమన్ పవన్ అరుస్తూ "మేము పెళ్లి చేసుకోబోతున్నాము " అని అరుస్తాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీలో కూడా సిద్దార్థ్, త్రిష కూడా ప్రేమించుకున్న సిద్దార్థ్ కి త్రిష అన్నయ్య ఒక టాస్క్ ఇస్తాడు. ధాన్యం పండించమని . ఐతే అమెరికన్ ఐన సిద్దార్థ్ ఎలాగో కస్టపడి దుక్కి దున్ని నాట్లేస్తాడు కానీ మొలకలు రావు. దాంతో చాల రోజులు బాధపడతాడు. ఒక రోజు సడెన్ గా త్రిష వచ్చి నిద్దరపోతున్న సిద్దార్థ్ ని లేపి పొలంలో వచ్చిన మొలకల్ని చూపిస్తుంది. వెంటనే సిద్దార్థ్ కూడా "నా పొలంలో మొలకలొచ్చాయ్ " అని అరుస్తాడు. డీమన్ పవన్ డైలాగ్ వింటే ఈ మూవీ డైలాగ్ గుర్తొస్తుంది ఆడియన్స్ కి.
ఇక ఈ సాంగ్ రిలీజ్ చేసిన ఒక్క రోజుకే 1 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుని సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఐతే ఈ సాంగ్ ని చూసిన నెటిజన్స్ ఇలా కామెంట్ చేస్తున్నారు. "ఎం ఫీల్ ఉంది సాంగ్. రీతూ , పవన్ రియల్ జోడిలా ఇచ్చి పడేసారు. రీతూ, పవన్ ప్రీ వెడ్డింగ్ షూట్, రియల్ లైఫ్ లో అనుకునేది ఒక్క సాంగ్ లో ఐపోయింది, పవన్ - రీతుకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సాంగ్. లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి ఎన్ని గొడవలు వచ్చినా సాల్వ్ చేసుకుని ముందుకెళ్లాలి, అచ్చం సినిమా సాంగ్ లా ఉంది" అంటూ పాజిటివ్ కామెంట్స్ చేస్తూ వీళ్ళను విష్ చేస్తున్నారు.
![]() |
![]() |