![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam l). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -167 లో.... గంగని ఎమోషనల్ గా చేసి ఓడించడానికి పారు, వీరు, ఇషిక ప్లాన్ చేస్తారు. గంగ పోటీలో గెలవడం చూడాలని రుద్ర ఇంటి నుండి బయల్దేరతాడు. రుద్ర వస్తున్న కార్ బ్రేక్ లు ఫెయిల్ అయ్యేలా చేస్తాడు వీరు. దాంతో రుద్ర ఒక దగ్గర కార్ ఆపుతాడు. అయిన తన వెంట రౌడీలు వచ్చి రుద్రపై ఎటాక్ చేస్తారు.
రుద్ర రౌడీలని కొట్టి అక్కడ నుండి తప్పించుకుంటాడు. అయినా రౌడీలు రుద్రని ఫాలో అవుతారు. మరొకవైపు మొదటి రౌండ్ లో గంగ గెలుస్తుంది. రుద్ర ఇంకా రాలేదని గంగ చుట్టూ చూస్తుంది. తన ఫ్రెండ్స్ తనకి సపోర్ట్ చేస్తారు. రుద్ర రావడం పారు చూసి అక్కడున్న అతనికి సైగ చెయ్యడంతో అతను వెళ్లి రుద్ర తలపై కొడుతాడు. రుద్ర కింద పడిపోతాడు. గంగ అని పిలుస్తాడు. దాంతో గంగ చూసి బయటకు వస్తుంటే వద్దని రుద్ర అంటాడు. అయిన వినకుండా గంగ వస్తుంది. దాంతో గంగ క్విట్ అవడం తో పారు విన్ అయిందని అనౌన్స్ చేస్తారు. దాంతో రుద్ర కోపంతో గంగ చెంపచెల్లుమనిపిస్తాడు. ఏం చెప్పాను.. వద్దు అన్నాను కదా.. ఎవరి ముందు అయితే నిన్ను విన్నర్ గా నిలబెదామనుకున్న కానీ నువ్వు ఇలా చేసావని కోప్పడుతాడు. నాకు మీ కంటే ఇది ముఖ్యం కాదు సర్ అని గంగ అంటుంది.
అ తర్వాత అందరు ఇంటికి వెళ్తారు. శకుంతల కోపంగా ఉంటుంది. రుద్రకి అలా అయిందని గంగ బయటకు వచ్చింది లేదంటే తనే విన్ అయ్యేది అని ఇంట్లో వాళ్లంతా గంగకి సపోర్ట్ గా మాట్లాడుతారు కానీ శకుంతల మాత్రం గంగని తప్పుపడుతుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |