![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 లో గత వారం వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న బిగ్ బాస్ హౌస్ కాస్త రణరంగంగా మారింది. తుమ్మితో లొల్లి.. దగ్గితే లొల్లి అన్నట్టుగా ముందు లొల్లి ఆ తర్వాతే ఏదైనా అంటున్నారు ఫిమేల్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్. సండే ఎపిసోడ్ లో వచ్చిరాగానే మీ పేరేంటని అడిగిన పాపానికి శ్రీజపై విరుచుకుపడింది దువ్వాడ మాధురి. అప్పుడే పాత కంటెస్టెంట్స్ కి వణుకు పుట్టింది.
ఇక నిన్నటి ఎపిసోడ్ లో రమ్య, దువ్వాడ మాధురి ఇద్దరు మాట్లాడుకుంటారు. తనూజని కళ్యాణ్ ఎక్కడ పడితే అక్కడే టచ్ చేస్తున్నాడు.. అలా లీనియన్స్ ఇచ్చింది.. నన్ను అలా టచ్ చేస్తే అసలు ఊరుకోనని మాధురితో రమ్య అంటుంది. అది చూసేవాళ్లకి కామెడీ అనిపించినా నవ్వకుండా ఉండాలి అంతే. ఇక ఉదయం వేకప్ సాంగ్ తర్వాత అందరు కిచెన్ దగ్గరికి వచ్చారు. మెయిన్ షెఫ్ అయినటువంటి దువ్వాడ మాధురి అందరికి టైమ్ కి టిఫిన్, భోజనం పెట్టాలి.. అలా చేయకుండా లేట్ చేసేసరికి కళ్యాణ్ తనని పిలుస్తాడు. ఇక్కడికి రండి.. కూర్చోండి మాట్లాడాలని దువ్వాడ మాధురిని కళ్యాణ్ అంటాడు. కూర్చుంటేనే చెప్తారా అని మాధురి వెటకారంగా మాట్లాడేసరికి కళ్యాణ్ కి కోపం వచ్చి.. నేను అలాగే మాట్లాడాల్సి వస్తుందని అంటాడు. ఎలా మాట్లాడుతావంటూ మాధురి రెచ్చిపోతుంది.
దివ్య మధ్యలో కలుగజేసుకొని అతను ఏమన్నాడు.. మీరు అలా అన్నందుకే కదా అలా అంది అని అనగానే దివ్య పైన కూడా మాధురి కోప్పడుతుంది. ఆ తర్వాత మాధురి ఏడుస్తుంటే.. కళ్యాణ్ వచ్చి తన తప్పు లేకున్నా సారీ చెప్తాడు. ఇలా రెండో రోజే దువ్వాడ మాధురి అనవసరంగా అందరిపై నోరు పారేసుకుంటూ ప్రేక్షకులకు చిరాకు తెప్పెంచేలా తన మాటతీరు ఉంది. మరి ఈ ఇష్యూలో దువ్వాడ మాధురిది తప్పా.. కెప్టెన్ కళ్యాణ్ ది తప్పా కామెంట్ చేయండి.
![]() |
![]() |