![]() |
![]() |

బుల్లితెర మీద ఈ మధ్య కాలంలో ఒక ఇన్సిడెంట్ ప్రతీ ఒక్కరినీ కదిలించింది. ఇటుక మీద ఇటుక పెట్టి అనే పాట ఎంత ఫేమస్ అయ్యిందో ఆ పాటను రాసిన దానికి తగ్గట్టు డాన్స్ చేసిన పండు మాష్టర్ కూడా అంతే ఫేమస్. పండు మాష్టర్ ని ప్రతీ ఒక్కరూ ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఢీ షో హోస్ట్ నందు ఐతే తనకు దేవుడు అవకాశం ఇస్తే గనక పండులా బతకాలనుకుంటాను అంటూ స్టేజి మీద చెప్పాడు. ఎందుకంటే పండు ఎం చేయాలనుకుంటాడో అది చేసేస్తాడు. ఎప్పుడూ హ్యాపీగా ఉంటాడు అని చెప్పాడు.
ఐతే రీసెంట్ గా అంటే జూన్ 3 న అతనికి యాక్సిడెంట్ కి గురయ్యాడు. విశాఖలో ఒక ఈవెంట్ చేసి వస్తుండగా ఒక చోట కార్ ఆపి దాని వెనక నిలబడిన పండు మాష్టర్ ని కోళ్ల వాన్ ఢీ కొట్టడంతో కాళ్లకు గాయాలై హాస్పిటల్ లో చేరాడు. అప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. ఇక అతన్ని పరామర్శించడానికి సుమ, శేఖర్ మాష్టర్, యష్ మాష్టర్ వీళ్లంతా వీడియో కాల్స్ లో మాట్లాడారు కొంతమంది డైరెక్ట్ గా వెళ్లి పలకరించారు. ఇక ఆడియన్స్ నెటిజన్స్ కూడా పండు మాష్టర్ ఆరోగ్యం బాగు కావాలని కోరుకుంటూ పూజలు చేశారు. ఇక జడ్జ్ విజయ్ బిన్నీ మాష్టర్ కోరుకుని ఒక జాకెట్ కూడా ఇస్తానని చెప్పారు. రష్మీ ఐతే పండు ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంది.
అలాంటి పండు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా ఒక పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకున్నాడు. బెడ్ మీద పడుకుని "హాయ్ ఎవ్రీ వన్ ...నరగోషకు నమస్కారం " అంటూ పెట్టాడు. దీన్ని బట్టి తనకు నరఘోష బాగా తగిలిందని చెప్పకనే ఆ మెసేజ్ చెప్పాడు. నిజంగా సైన్స్ పరంగా ఆలోచిస్తే ఇదంతా ట్రాష్ అనే వాళ్ళు ఉన్నారు. కానీ తరతరాలుగా పెద్దలు చెప్తూ వస్తున్న మాట కూడా ఒకటి ఉంది నరఘోషకు నల్లరాయి కూడా పగులుతుంది అని. నిజానిజాలు ఎలా ఉన్నా కానీ చాలామంది ఈ నమ్మకాన్ని ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు.
![]() |
![]() |