![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -597 లో....ఎలాగైనా ఈ రోజు జ్యోత్స్న గురించి అందరికి చెప్పాలని కార్తీక్ తో దాస్ అంటాడు. ఇప్పుడు వద్దు మావయ్య.. అత్తయ్య పరిస్థితి ఏం బాలేదని రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడే డాక్టర్ హారిక ఫోన్ చేసి దశరథ్ గారు హాస్పిటల్ కి వచ్చి సాంపిల్స్ రిపోర్ట్స్ అడిగారు. ఏం చెయ్యాలో అర్థం కాక మెయిల్ చేస్తానని చెప్పానని డాక్టర్ చెప్పగానే సరే డాక్టర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు.. వెంటనే మావయ్య మెయిల్ చెయ్యండి అని చెప్తాడు. డాక్టర్ సరే అంటుంది. కార్తీక్ రైట్ డెసిషన్ తీసుకున్నాడని డాక్టర్ హారిక అనుకుంటుంది.
కార్తీక్ ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకున్నాడని దాస్ అనుకుంటాడు. గుడికి వెళ్ళడానికి తీసుకొని వచ్చిన వస్తువులు ఏం చేద్దామని కాంచనతో అనసూయ అంటుంది. అప్పుడే కార్తీక్ వచ్చి రేపు వెళదామని చెప్తాడు. దాంతో కాంచన హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు శివన్నారాయణ, దశరథ్ ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడే డాక్టర్ హారిక, దశరథ్ కి ఫోన్ చేసి రిపోర్ట్స్ మెయిల్ చేసానని చెప్తుంది. రిపోర్ట్స్ చూసి దశరథ్ షాక్ అవుతాడు. అంతలోనే కార్తీక్ ఫోన్ చేసి రిపోర్ట్స్ చూసారా మావయ్య అని అడుగుతాడు. చూసానంటే రిపోర్ట్స్ గురించి ముందే తెలుసా అని దశరథ్ అడుగుతాడు. అన్నింటికి రేపు సమాధానం దొరుకుతుంది గుడికి రమ్మని చెప్తాడు.
మరొకవైపు దీప టెన్షన్ పడుతుంటే.. నువ్వు కూల్ గా ఉండు.. అన్నింటికి పరిష్కారం రేపు దొరుకుతుందని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత కార్తీక్ ఏం చెప్తాడోనని దశరథ్ ఆలోచిస్తాడు. అక్కడే సుమిత్ర, జ్యోత్స్న ఉంటారు. ఏమైంది డాడి అని జ్యోత్స్న అడుగుతుంది. చాలావాటికి రేపు సమాధానం దొరకబోతుందని దశరథ్ అనగానే జ్యోత్స్న భయపడుతుంది. మరుసటి రోజు కార్తీక్, దశరథ్ గుడికి వస్తారు. అసలు ఏం జరుగుతుంది. జ్యోత్స్న సాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు.. అయిన మ్యాచ్ అయ్యాయని ఎందుకు చెప్పారని కార్తీక్ ని దశరథ్ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |