![]() |
![]() |

ఢీ సెలబ్రిటీ సీజన్ 2 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి జడ్జ్ గా బాబా మాష్టర్ వచ్చాడు. ఇక రావడమే ఆది మీద సెటైర్స్ వేసాడు. "చూసావా నేను ఇయర్లీ ఒన్స్ వస్తాను. నువ్వు కూడా అలా రారా..రిటైర్మెంట్ అవార్డు ఇచ్చేసి పంపేయండిరా బాబు..ఆదికి ఏదైనా గ్యాస్ ట్రబుల్ అనుకుంటా" అని పిచ్చ జోక్స్ వేసేసరికి ఆది కూడా సైలెంట్ నవ్వాడు తప్ప రిప్లై ఇవ్వలేదు. ఇక ఆది మీద ఒక చిన్న పాప కూడా సెటైర్స్ వేసింది.." నీకు ఫుడ్ పెట్టనా, స్నాక్స్ పెట్టనా" అని అడిగాడు ఆది. "నీ ముఖం కొంచెం దూరంగా పెట్టు చూడలేక చస్తున్నా" అంది ఆ పాప సీరియస్ గా. ఇక రాము రాథోడ్ చిరంజీవికి వేసిన డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు.
ఇక మధు బాబు డాన్స్ కూడా అదిరిపోయింది. లాస్ట్ వీక్ ఐతే మధు బాబు సగం లోనే డాన్స్ ఆపేసాడు. ఇక సుదర్శన్ మాస్టర్ తన టీమ్ తో "ఒక లైలా కోసం" సాంగ్ ని వెరైటీ డాన్స్ తో అన్ని రకాల ఎలిమెంట్స్ ని మిక్స్ చేసేసరికి బాబా మాష్టర్ పిచ్చ ఖుషీ ఐపోయాడు. హన్సికాకు అన్ని భాషల్లో ప్రొపోజ్ చేస్తానని అని తెలుగులో చెప్పాడు కన్నడ అర్ధం కాక వదిలేసాడు. ఇక లాస్ట్ లో జనులూరి వచ్చి భానుప్రియ సాంగ్ "ఆకాశంలో ఆశల హరివిల్లు" సాంగ్ కి చేసిన డాన్స్ తో అందరి మతులు పోయాయి. నెటిజన్స్ కూడా జాను డాన్స్ ని తెగ పొగిడేస్తున్నారు.
![]() |
![]() |