![]() |
![]() |

చెఫ్ మంత్ర ఇప్పటి వరకు 5 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు కొత్త సీజన్ తో మొదలు కాబోతోంది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. అది కూడా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ యూఎస్ ఏ. ఎప్పటిలాగే ఈ కొత్త సీజన్ కి కూడా హోస్ట్ గా సుమ వ్యవహరిస్తున్నారు. " నమస్కారం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా" అంటూ పలకరించారు. మైళ్ళ దూరంలో ఉండే తెలుగు వాళ్లందరినీ కూడా కలిపేదేంటో తెలుసా మన తెలుగు వంటకాలు. దేశాలు మారితే టైం జోన్ మారుతుందేమో కానీ సుమ ఫన్ జోన్ మారదు. సో న్యూయార్క్ లో న్యూ స్పార్క్ ని క్రియేట్ చేయడానికి వచ్చేసింది చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ యూఎస్ ఏ. " అని చెప్పింది.
ఇక ఈ షోకి వరుణ్ - కార్తీక్ వచ్చేసారు. రాగానే సుమ భయపెట్టేసింది. "రక్షితకు - రవితేజ మధ్య రొమాన్స్ ఏది" అని అడిగేసరికి వరుణ్ వెర్రి చూపులు చూసాడు . తర్వాత ఒక పెద్ద కౌంటర్ ఇచ్చాడు. " యూఎస్ ఏ వీసా అండ్ మీరు ఒక్కటే తెలుసా మీకు " అన్నాడు. ఎందుకు అని సుమ అడిగేసరికి "ఎందుకంటే మీ క్రేజ్ ఎప్పుడూ తగ్గేదేలే" అన్నాడు వరుణ్. తర్వాత కార్తీక్ తన గిటార్ తో వచ్చాడు. సుమ అతనికి కౌంటర్ ఇచ్చింది. "కరోనా టైములో నేనేమో పేషెంట్ ఐతే నువ్వేమో సింగర్ అయ్యావు . వంటలవీ వచ్చు కదా బానే " అంది. "మ్యాగీ వచ్చండి" అన్నాడు. "నీకేమొచ్చు " అని వరుణ్ ని అడిగింది. "నాకేమీ రాదు " అన్నాడు.
తర్వాత అర్జున్ కొత్తకొండ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. తర్వాత సోషల్ మీడియాలో చైత్ర, తార ట్విన్ స్టోరీస్ పేరుతో పాపులరైన చిన్నారి సిస్టర్స్ ఈ షోలో వాళ్ళ పేరెంట్స్ తో సహా వచ్చేసారు. ఇద్దరు ట్విన్స్ చూడడానికి ఒకేలా ఒకే టైపులో కాస్ట్యూమ్ వేసుకుని వచ్చేసరికి "వీళ్ళను ఎలా గుర్తు పట్టాలి" అని సుమ వాళ్ళ పేరెంట్స్ ని అడిగింది. "ఈ డ్రెస్ మీద ఫ్లవర్స్ ముందు ఉంటే తారా ఫ్లవర్స్ వెనక ఉంటే చైత్ర " అని వాళ్ళ మదర్ మౌనిక చెప్పారు. వెంటనే సుమ "పేరులోనే ఫ్లవర్స్ ఉంటే సుమ " అనేసరికి అందరూ నవ్వేశారు.
తర్వాత లైఫ్ స్టైల్, బ్యూటీ, ఫాషన్ డిజైనర్ రాధ ప్రియాంక వచ్చారు. తర్వాత అపర్ణ దాట్ల వచ్చేసారు. "ఏంటి నువ్వు ఒక్కదానివే వచ్చావ్" అని సుమ అడిగేసరికి "నాకు వంట రాదు" అని చెప్పారు. "మరి ఇక్కడేం చేస్తావ్ " అని మళ్ళీ సుమ అడిగేసరికి "వంట " అని చెప్పారు అపర్ణ. అంతే సుమ షాకైపోయింది. అపర్ణ దాట్ల ఎంటర్టైనర్ గా ఉన్నారు. అలాగే గుండె జారీ గల్లంతయ్యిందే, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీస్ లో కూడా నటించారు. ఈవిడ సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ .
అలాగే అమ్మ అమ్మడు అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేసే యశోద కుందూరు కూడా ఈ షోలో కనిపించారు. ఇక వీళ్లకు టాస్కులు ఇచ్చే మెయిన్ పర్సన్ చెఫ్ వంశీ కృష్ణ ఆది ఉన్నారు. ఇలా అందరూ ఈ ప్రోమోలో కనిపించారు. ఫైనల్ గా చెఫ్ మంత్ర అంటే నేషనల్ అనుకుంటిరా చెఫ్ మంత్ర అంటే ఇంటర్నేషనల్ అని చెప్పింది సుమ. అంటే ఈ షోలో కనిపించేవాళ్లంతా రెగ్యులర్ గా సోషల్ మీడియాలో రీల్స్ , వీడియోస్ రూపంలో కనిపిస్తూనే ఉంటారు. ఈ షో 13 నుంచి ప్రతీ గురువారం అమెరికాలో ఉదయం 10 గంటలకు ఇండియాలో రాత్రి 7 గంటలకు ఆహా ఓటిటి ప్లాట్ఫార్మ్ మీద ప్రసారం కాబోతోంది.
![]() |
![]() |