![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1111 లో... రాజు, లక్కీ విషయం రేఖకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని హెచ్చరిస్తాడు. పిన్ని ఇన్ని రోజులు నీ పరువు, నీ కుటుంబం కోసం లక్కీ విషయం ఇంట్లో చెప్పలేదు. కానీ ఇక నా వల్ల కాదు. నేను చెప్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. బాబాయ్, మదన్ నిన్ను వదిలేసే అవకాశం ఉంది.. ఎలా డీల్ చేస్తావో నీ ఇష్టమని చెప్పి రాజు వెళ్లిపోతాడు. మరోవైపు నందు, వెంకీ కలుసుకుంటారు. వెంకీ తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి ఫొటో చూపించగా, పొరపాటున నందు ఫొటో కనిపిస్తుంది. నందు సిగ్గుపడుతుంది. కానీ వెంటనే వెంకీ మరో అమ్మాయి ఫొటో చూపించి.. నువ్వు కాదు నందు.. ఈ అమ్మాయి అని చెప్తాడు. నందు బాధగా.. నువ్వు ఎవరినీ ప్రేమించడం లేదా అని అడుగుతుంది. నాకు ప్రేమ సెట్ కాదు.. నన్నెవరూ ప్రేమించరు. నా మనసులో ఎవ్వరూ లేరని అంటాడు. చివరికి ఈ అమ్మాయి నాకు సెట్ అవుతుందా అని నందునే అడుగుతాడు వెంకీ. దాంతో నందు మనసులో బాధపడుతుంది.
ఇక ఇంటికి వచ్చిన రాజు మాత్రం ఎంతో సంతోషంగా ఉంటాడు. అందరికీ స్వీట్లు పంచుతూ, శేషుతో కలిసి సరదాగా డ్యాన్స్ చేస్తాడు. ఇంతకీ మ్యాటర్ ఏంటి అల్లుడు అని శేషు అడగగా.. రాజు పెద్ద నోట్ల కట్టలు చూపిస్తాడు. అంత డబ్బు చూసి భ్రమరం షాక్ అవుతుంది. ఇంతకాలం రాజుపై కోపంగా ఉన్న ఆమె కూడా డబ్బు చూసిన వెంటనే ప్రేమగా మాట్లాడుతుంది. ఇన్ని డబ్బులు ఎక్కడివి అల్లుడు శేషు అడగగా.. ఆ అలవాటు నాకు లేదు.. అత్తయ్యకు ఉంది. లెక్కలు ఉన్నాయి.. బయటకు తీయ్ అత్తయ్య అంటూ భ్రమరాన్ని ఆటపట్టిస్తాడు. ఎప్పుడూ నీ చెల్లిని తక్కువ చేసి చూస్తావ్.. ఆమె ఎంత కష్టపడి ఈ లాభాలు సంపాదించిందో చూశావా? అని ఐశ్వర్యతో రాజు అంటాడు. కానీ ఐశ్వర్య మాత్రం.. ఏదో అదృష్టం కలిసి వచ్చి ఉంటుందని కొట్టిపారేస్తుంది.
తర్వాత ఇందు రేఖకు పెండింగ్ బిల్లుల వివరాలు చెప్తుంది. ప్రాపర్టీ టాక్స్, ఉద్యోగుల జీతాలు, కొత్త ప్రాజెక్ట్ అడ్వాన్స్ ఇలా చాలా ఖర్చులు ఉన్నాయని చెప్పి, చివర్లో సుభాష్ ఆపరేషన్ కూడా చేయాల్సి ఉందని చెప్తుంది. ఇప్పుడు ఆపరేషన్ అంత అవసరమా? అని భ్రమరం అంటుంది. ఇందు తన మొదటి జీతంతో తాతయ్య ఆపరేషన్ చేయించాలని అనుకుంది. దీనికి ఎవరి పర్మిషన్ అవసరం లేదని రాజు అంటాడు. నా గురించి ఎందుకు అమ్మా.. మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోండి అని సుభాష్ అంటాడు. మీరు మళ్లీ ముందులా ధీమాగా నడుస్తూ ఉండటం నేను చూడాలి తాతయ్య అని రాజు ఎమోషనల్ చెప్తాడు. చివరగా ఇందు.. ఆపరేషన్ గురించి మీరు ఆలోచించకండి.. నేను డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుని తర్వాత చెప్తానని ఇందు చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Brahmamudi serial, Star Maa serials, Brahmamudi today episode, Raju Indu Brahmamudi, Telugu television updates
![]() |
![]() |