![]() |
![]() |
.webp)
తెలుగు బుల్లితెర పై ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కి రంగం సిద్దమయ్యింది. లాస్ట్ సీజన్లో మాదిరిగానే ఈసారి కూడా "అగ్నిపరీక్ష" ద్వారా కామన్ మ్యాన్ ఇంట్లోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తున్నారు.జూన్ 12 నుంచి జూన్ 20 వరకు అగ్నిపరీక్ష కోసం ఆడిషన్ వీడియోలను పంపాలని బిగ్ బాస్ టీమ్ వెల్లడించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రోమోలో హోస్ట్ నాగార్జున అక్కినేని మాట్లాడుతూ "జీవితంలో అద్భుతాలు సాధించేందుకు సామాన్యులకు కొన్ని అవకాశాలే వస్తాయి. అలాంటి అవకాశం మళ్లీ మీ ముందుకు వచ్చింది..
అదే బిగ్ బాస్ అగ్నిపరీక్ష-2" అని హీరో అండ్ హోస్ట్ నాగ్ చెప్పడం ఆడియన్స్ లో ఒక హైప్ ని క్రియేట్ చేసింది. గత సీజన్ నుంచి స్టార్ట్ చేసిన అగ్నిపరీక్ష కాన్సెప్ట్ మంచి ఆదరణ పొందింది. వేలాది మంది దరఖాస్తు చేసుకోగా, చివరకు కొద్దిమందికే బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే అవకాశం లభించింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్ వంటి కంటెస్టెంట్లకు విశేషమైన గుర్తింపు లభించింది. సెలబ్రిటీ కంటెస్టెంట్లతో సామాన్యుల మధ్య జరిగిన పోటీ గత సీజన్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీంతో ఈసారి అగ్నిపరీక్షపై మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పటికే బిగ్ బాస్ 10లో పాల్గొనే అవకాశం ఉన్న పలువురు ప్రముఖుల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా నిఖిల్ , పల్లవి గౌడ, తేజస్విని గౌడ , పల్లవి రామిశెట్టి, హరి వీళ్లంతా కుక్కు విత్ జాతిరత్నాలు, ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో ప్రస్తుతం చేస్తున్నారు. వీళ్లంతా వేళ్ళ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో ఎవరెవరు ఫైనల్ లిస్ట్ లో ఉంటారు అనేది చోటు దక్కించుకుంటారో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇంటరెస్ట్ , టాలెంట్ , యూనిక్ క్వాలిటీ ఉన్నవాళ్లకు నిజంగా ఇదొక మంచి అవకాశం కూడా. మరి ఈసారి కామన్ మ్యాన్ క్యాటిగరీలో ఎంత మంది వెళతారో ఎలా అలరిస్తారో చూడాలి.
![]() |
![]() |