![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-8 లో లేడీ కంటెస్టెంట్స్ లలో మోస్ట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరంటే రోహిణి అని చెప్పేస్తారు. ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన పృథ్వీలని ఓడించి మెగా చీఫ్ అయింది రోహిణి. (Bigg Boss Rohini)
వైల్డ్ కార్ట్ గా ఎంట్రీ ఇచ్చింది రోహిణి. తను ఎంటర్టైన్ చేస్తూ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. రోహిణి కమెడియన్ కాదంటు ప్రతీ టాస్క్ లో ఆడపులిలా ఆడింది. దాదాపుగా విన్నర్ గెలుచుకునేంత అభిమానాన్ని అందుకున్న ఈ రౌడీ రోహిణి.. అక్టోబర్ 6న బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లోకి ఐదో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. అలా బిగ్ బాస్ తెలుగు 8 సీజన్లో 9 వారాలు (63 రోజులు, 2 నెలలకుపైగా) రోహిణి ఉంది. అయితే, ఈ సీజన్లో పాల్గొనేందుకు రోహిణి వారానికి రూ. 2 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. ఇలా చూస్తే 9 వారాలకు బిగ్ బాస్ 8 తెలుగు ద్వారా రోహిణి రూ. 18 లక్షల పారితోషికం అందుకుందని తెలుస్తోంది. అయితే, 2 లక్షలు మాత్రమే కాకుండా రోహిణి బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు వారానికి రూ. 4 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు మరో టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన చూస్తే బిగ్ బాస్ తెలుగు సీజన్-8లో తొమ్మిది వారాలున్న రోహిణి మొత్తంగా ముప్పై ఆరు(36)లక్షలు సంపాదించిందని తెలుస్తోంది.
బిగ్ బాస్ ప్రతి సీజన్లో లేడీ కంటెస్టెంట్స్ వస్తుంటారు.. పోతుంటారు. కానీ.. ఇంతకు ముందు.. ఇకపై ఎవరైనా లేడీ కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వస్తుంటే మాత్రం రోహిణిలా ఆడాలి అనేట్టుగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఆమె శరీరాన్ని చూసి హేళనగా నవ్వారు. ఇదేం ఆడుతుందంటూ జీరోని చేశారు. కామెడీ తప్ప ఏమీ లేదంటూ చులకన చేసి మాట్లాడారు. కానీ వాళ్లే చివరికి సలామ్ కొట్టేట్టుగా హిస్టరీ క్రియేట్ చేసింది రోహిణి. ఇప్పటివరకూ బిగ్ బాస్ తెలుగు చరిత్రలో టైటిల్ గెలిచిన వాళ్ళకి కూడా ఈ స్థాయిలో గుర్తింపు రాలేదు.
![]() |
![]() |