Home  »  TV News  »  Bigg Boss 9 Telugu : భరణితో బలగం2.. బిగ్ బాస్ హౌస్ లో కొత్త కుటుంబం!

Updated : Oct 11, 2025

 

బిగ్ బాస్ హౌస్ లోకి రావాలంటే రాసి పెట్టి ఉండాలని, వన్ టైమ్ ఆచీవ్మెంట్  అని అంటారు. హౌస్ లోకి వచ్చి కాస్త ఫేమ్ సంపాదించి తమకంటూ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటారు. అయితే బిగ్ బాస్ హౌస్ హిస్టరీ లోనే లేని విధంగా ఈ సీజన్ లో ఎన్నో బంధాలు పెనవేసుకొని ఉన్నాయి. కంటెస్టెంట్స్ కప్ కోసమో లేక బంధాలు పెంచుకోవడం కోసమో ఈ సీజన్-9 కి వచ్చారో అర్థమవ్వడ‌ం లేదు.

బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు ఒక మమతల కోవెల.. అందులో అన్ని బంధాలు ఉంటాయని చెప్పిన ఏకైక సీజన్ ఏదంటే అది బిగ్ బాస్ 9. ఈ సీజన్-9 ఇంటి పెద్ద ఎవరంటే మన రేలంగి మావయ్య భరణి.. అతనే మహావృక్షం. అతనికి ఇద్దరు కూతుళ్లు.. చిన్న కూతురు దివ్య, పెద్ద కూతురు తనూజ. ఇక కంటెస్టెంట్స్ అందరు కూడా అన్నయ్య, బాబాయ్, మామ అంటూ భరణిని పలకరిస్తుంటారు. ఇలా భరణికి పెద్ద బలగమే ఉంది. ఈ సీజన్ అయ్యాక భరణితో బలగం-2 తీసిన పెద్ద హిట్టే అవుతుంది. ఎందుకంటే అలా అన్ని బంధాలని పెనవేసుకున్నాడు భరణి. ఇక బంధాలకి పుట్టినిళ్ళుగా మారింది సీజన్-9 బిగ్ బాస్ హౌస్.

మరోవైపు హౌస్ లో లవ్ ట్రాక్ లు కూడా ఉన్నాయి. అసలు హౌస్ లోకి ఏ పర్పస్ తో వచ్చారన్న విషయమే మర్చిపోయారు కొందరు. మన యువ జంట రీతూ చౌదరి, డీమాన్ పవన్ సందు దొరికితే చాలు హగ్ ఇచ్చుకుంటున్నారు. హౌస్ లో ఈ ఇద్దరు  కరువులో ఉన్నట్లు వారి చేష్టలున్నాయి. ఇక కళ్యాణ్, తనూజ వీళ్లు లవ్ ట్రాక్ నడపలేకపోయారు. ఎందుకంటే కళ్యాణ్ కంటే తనూజ రెండేళ్లు పెద్దదట.. వీళ్లతో ఏమాయ చేసావే-2 తీస్తే సెట్టు.

బిగ్ బాస్ హౌస్ లో పెనవేసుకున్న ఇంకొక బంధం తల్లి, కొడుకుల బంధం. సంజన, ఇమ్మాన్యుయల్.. ఇద్దరి బాండింగ్ చూస్తుంటే సొంత తల్లీకొడుకులు కూడా అలా ఉండరేమో.. మమ్మీ అంటూ ఇమ్మాన్యుయల్ బిడ్డ అంటూ సంజన.. ఇద్దరికి ఇద్దరు సరిపోయారు. తాజాగా ఒక ఎపిసోడ్ లో.. నా తల్లి తర్వాత సంజనని అమ్మ అని పిలిచానని ఇమ్మాన్యుయల్ అన్నాడు. తన కోసం ఈ పాట అంటూ సువ్వి సువ్వాలమ్మ పాటని పాడి వినిపించాడు. దీన్ని బట్టి చూస్తే అందరు గేమ్స్ కంటే బంధాలకి ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. వెళ్ళందరు కెమెరా స్క్రీన్ స్పేస్ కోసం చేస్తున్నారా లేదంటే నిజమైనా ఎమోషనా అనేది తెలియాలంటే మరికొన్ని వారాలు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.