![]() |
![]() |

జనతా గ్యారేజ్ సినిమాలోని ప్రణామం ప్రణామం సాంగ్ తో మొదలైంది. ఇక అమర్ దీప్ కి జ్యోతిష్యం చెప్పమంటూ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. మొదటగా ప్రశాంత్ కి జ్యోతిష్యం చెప్పాడు అమర్ దీప్. పొలం దగ్గర నీకు తాబేలు దొరికిందని ప్రశాంత్ తో అమర్‌దీప్ అన్నాడు. కప్ చుట్టూ నీతో పాటు అయిదుగురున్నారని ప్రశాంత్ తో అమర్‌దీప్ అన్నాడు. నీతో ఉండి మసాజ్ లు చేసినవారిని కూడా పంపించేశావంటూ యావర్ తో అమర్ దీప్ అన్నాడు. పాద ముద్రిక, పాద ముద్రికే కాదు.. ముఖం చూసి కూడా చెప్పగలనని ప్రియాంకతో అమర్ దీప్ అన్నాడు. పైకి కనిపించేంత కూల్ కాదు లోపల ఒక అగ్నిగుండం అంత పర్వతం ఉందని, ఒక జెలస్ ఉందని, పైకి తెలియని ఒక సైకో కిల్లర్ అని , ఏం జరిగిన ఎంత జరిగిన గట్టోడు ఒకడు ఉన్నాడని ప్రియాంక చేయి తీసుకొని జాతకం చెప్పాడు అమర్ దీప్. ఈ మనిషి అందరిని ఎంకరేజ్ చేశాడండి ఒక్కడిని తప్ప అని అర్జున్ తో అమర్ దీప్ అనగా.. ఎంకరేజ్ చేసిన పెద్ద లాభం లేకుండా పోయిందని అర్జున్ అన్నాడు. పల్లవి ప్రశాంత్, యావర్ మీకు ఇద్దరు రెండు కళ్ళలాంటివాళ్ళు. ఏం ఇచ్చిన వారికే ఇస్తారు . మీ ముందున్నోడికి మాత్రం ఏమీ ఇవ్వరు. మీ జాతకం ప్రకారం మీ గొంతు చూసి మీ దరిదాపుల్లో కూడా ఎవరూ వచ్చి ఉండరు. మీరు మీవే పెద్ద మీసాలని ఫీలవుతూ ఉంటారు. మీ ఎదురుగా ఉన్నవాళ్ళవి మీరు గుర్తించట్లేదని అమర్ దీప్ అనగానే.. శివాజీ మీసం తిప్పాడు. ఆ తర్వాత కాసేపటికి అమరాచార్య పోయాడు. శివాజీ జ్యోతిష్యుడిగా మారి అమర్ దీప్ యొక్క జ్యోతిష్యం చెప్పమని బిగ్ బాస్ పోస్ట్ లెటర్ ద్వారా చెప్పాడు.
నీ జాతకం నీ చేతులు చూడక్కర్లేదు. నీ ఫేస్ చూస్తే చాలని అమర్ దీప్ కి జ్యోతిష్యం మొదలెట్టాడు శివాజీ. సహజంగా నిన్ను చూడగానే .. ఎవడీ ఎదవ అని మనసులో వస్తుంది జనాలకి అని శివాజీ అంటాడు. నాయన గ్రహచారం, ఆచారం నీ గోచీ ఊడే సమాచారమని అర్జున్ అనగానే.. నీ జాతకం మొత్తం బయటకు రావాలని శివాజీ అన్నాడు. కప్పు కోసం పోరాడుతున్న క్రమంలో నీకో దరిద్రమైన ఆలోచన కూడా ఉందొరోయ్ అని శివాజీ అనగానే.. వాళ్ళు ఇచ్చేదేంటి నేనే తీసుకుపోదామనే ఆలోచన ఉందని శివాజీ అనగానే.. అవునా స్వామి అని అమర్ దీప్ అనగానే.. నీకేరా వెదవ అని శివాజీ అన్నాడు. ఇక కాసేపటికి కెమెరాల ముందుకు అర్జున్ వెళ్ళి.. హ్యాపీ ఆనివర్సరీ అమర్ దీప్ అని చెప్పగా అక్కడికి అమర్ దీప్ వెళ్ళి థాంక్స్ చెప్పాడు. కాసేపటికి.. అర్జున అమర్ దీప్ లైఫ్ లో ఇది ఎన్నో ఆనివర్సరీ అని బిగ్ బాస్ అనగానే హౌస్ అంతా నవ్వుకున్నారు. బిగ్ బాస్ అఫీషియల్ గానా? అనఫీషియల్ గానా బిగ్ బాస్ అని అర్జున్ కామెడీ చేశాడు. ఒక్కటే బిగ్ బాస్ అని అమర్ దీప్ అన్నాడు. ఆ తర్వాత కప్ కేక్ లు కావాలని బిగ్ బాస్ కి అమర్ దీప్ రిక్వెస్ట్ చేయగా.. ఎన్ని క్యాలరీలుంటాయని బిగ్ బాస్ అడిగాడు. బేకరివాడు వేసే క్రీమ్ ని బట్టి క్యాలరీలుంటాయని అమర్ దీప్ అనగా.. రాంగ్ ఆన్సర్ అని బిగ్ బాస్ అన్నాడు.
విన్నర్ గా నిలిచేవారు చివరిదాకా వచ్చి ఆగిపోరు. మీరందరు ఈ సీజన్ ఆఖర్లో ప్రేక్షకులకి ఎలా గుర్తుండిపోవాలని అనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండని బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఎవరైతే ఇంటినుండి ఫుడ్ మిస్ అయ్యారో వారికి కొన్ని వీడియోలున్నాయని బిగ్ బాస్ చెప్పాడు. " బంగారం నీకోసం అమ్మ చేతి అన్నం, మటన్ వండి పంపిస్తున్న తిను బిడ్డ" అని ప్రశాంత్ వాళ్ళ నాన్న చెప్పాడు. ప్రియాంక వాళ్ళ అమ్మ రోటీలు చేసి పంపించిందని చెప్పింది. ఇక యావర్ కోసం వాళ్ళ బ్రదర్స్ కలకత్తాకే బిర్యానీ, కీర్ పంపిస్తున్నాం బాగా తిను యావర్ కి చెప్పారు. ఇక మొదటి గేమ్ లో అమర్‌దీప్ గెలచి యావర్ కి ఫుడ్ ఇవ్వమని చెప్పాడు. ఇక యావర్ ని ఎవరో ఒకరితో ఫుడ్ షేర్ చేసుకోమని చెప్పగా అతను అంగీకరించకపోవడంతో ఆ ఫుడ్ వెనక్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత టాస్క్ లో అర్జున్ గెలుస్తాడు. ప్రశాంత్ కోసం ఫుడ్ ని ఇస్తాడు అర్జున్. ఇక అమర్ దీప్ ని సెలెక్ట్ చేసుకుంటాడు ప్రశాంత్. ఆ తర్వాత యాక్టివిటి ఏరియాలో ప్రశాంత్, అమర్ కలిసి తిన్నారు. కాసేపటికి అమర్ తో కలిసి హాలోగ్రామ్ ద్వారా తేజస్విని గౌడ తో అమర్ దీప్ మాట్లాడాడు. ఆ తర్వాత అందరికి హల్దీరామ్స్ నుండి స్నాక్స్ వచ్చాయి. హౌస్ మేట్స్ కి ఫుల్ మీల్స్ లా స్నాక్స్ వచ్చాయి. ఇక వాటిని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ తినేశారు.
![]() |
![]() |