![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-7 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ అంబటి అర్జున్. పవరస్త్రని గెలిచి మొదటి ఫైనలిస్ట్ గా ఫైనల్ కి చేరుకున్న కంటెస్టెంట్ అంబటి అర్జున్. ఇక ఫినాలే వీక్ లో హౌస్ లో అరుగురు కంటెస్టెంట్స్ ఉండగా వారి జర్నీ వీడియోలని బిగ్ స్క్రీన్ మీద వేసి చూపించాడు. మొదట అమర్ దీప్ జర్నీ వీడియో వేశాడు. ఆ తర్వాత అంబటి అర్జున్ జర్నీ వీడియోని ప్లే చేసి చూపించాడు బిగ్ బాస్.
అర్జున్ ఒక్కడినే గార్డెన్ ఏరియాలోకి రమ్మని పిలిచాడు బిగ్ బాస్. అందులో మంచు పడుతుంటే మధ్యలో లైట్స్ అండ్ డెకరేషన్ ఆ సెటప్ తన జర్నీ ఫొటోలు చూసి అర్జున్ ఫిధా అయ్యాడు. ఇక తన ఆల్బమ్ ఓపెన్ చేయగానే అందులో తన భార్య హౌస్‌లోకి వచ్చిన ఫొటోలు చూసి ఎమోషనల్ అయ్యాడు అర్జున్. పప్పీ.. ఫొటోస్ చూడు భలే వచ్చాయ్.. థాంక్యూ బిగ్‌బాస్.. ఈ మూడు ఫొటోలు నా బెస్ట్ అంటూ అర్జున్ అన్నాడు. ఇక అక్కడే ఒక గిన్నెలో ఉల్లిపాయలు కూడా పెట్టాడు బిగ్‌బాస్. వీటిని చూసి తన టాస్కు గుర్తొచ్చి నవ్వుకున్నాడు అర్జున్. ఈ పది వారాలు నా లైఫ్‌లో ఎప్పుడు మర్చిపోలేని జర్నీ బిగ్‌బాస్ అంటూ అర్జున్ చెప్పాడు. కళ్ల ముందు ఒకసారి అలా తొమ్మిది వారాలు కనిపించాయి. థాంక్యూ సోమచ్ బిగ్ బాస్ అంటు అర్జున్ చెప్పాడు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అర్జున్ వచ్చిన క్షణాల నుంచి ఫినాలే అస్త్ర గెలిచినంత వరకూ అర్జున్ జర్నీని వీడియోని రూపొందించాడు బిగ్ బాస్. ముఖ్యంగా అడుగుపెట్టిన తర్వాతి రోజే రెండు చేతులతో రెండు రాకెట్లను పట్టుకొని యావర్‌ని ఓడించిన టాస్కు హైలెట్‌గా చూపించారు. ఇక నాగార్జునని ఇమిటేట్ చేసిన సీన్, అమర్, ప్రశాంత్ ల మధ్య గొడవని ఆపిన సీన్, పోల్ డ్యాన్స్ చేసే సీన్, బేబిలతో అర్జున్ ఆడుకున్నప్పుడు.. నువ్వు మంచి తండ్రివి అవుతావని ఆ బేబీ డాల్స్ చెప్పే సీన్ అంతా కూడా బాగా ఆకట్టుకుంది. ఇక గేమ్ మొదలుపెట్టి ప్రతి టాస్కులోనూ దూసుకెళ్లిపోయిన తన ఆట చూసి అర్జున్ నవ్వుకున్నాడు. ఇక హౌస్‌లోకి తన భార్య వచ్చినప్పుడు ఎమోషనల్ అయిన సీన్లు చూసి అర్జున్ ఏడ్చేశాడు. ఇక శివాజీ ఫ్రెండ్ షిప్ బ్యాండ్ తీసేసింది, అందరూ నామినేషన్లు వేసింది నీట్ గా ఉంది. ఇక చివరిలో వరుసగా టాస్కులు గెలిచి ఫినాలే అస్త్ర గెలిచినవి చూపిస్తూ వెనకాల బాహుబలి మ్యూజిక్ వేసి ఇరగదీశాడు బిగ్ బాస్. తన జర్నీ వీడియో పూర్తి కాగానే అర్జున్ ఫిధా అయ్యాడు. అసలేం మాట్లాడాలో తెలీక కాసేపు సైలైంట్ అయ్యాడు అర్జున్. లైఫ్‌లో ఫస్ట్ చైల్డ్ అంటే అందరికీ స్పెషలే కానీ ఇలాంటి సమయంలో కూడా నన్ను సపోర్ట్ చేసి పంపించింది నా వైఫ్. నిజంగా తన కల పూర్తిగా నెరవేర్చాలనే ఉంది. ఒక్కడినే ఉన్నాను. నా కోసమే ఆడాను. ఒక్కడినే ఇక్కడి వరకు వచ్చాను. మీరిచ్చిన మెమోరీస్ ఎప్పటికీ మర్చిపోలేను బిగ్‌బాస్. నిజంగా ఈ జర్నీ మెమోరీస్‌కి రుణపడి ఉంటాను. థాంక్యూ సో మచ్ బిగ్ బాస్ అంటూ అర్జున్ చెప్పుకున్నాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళాడు అర్జున్. జర్నీవీడియో ఎలా ఉందని హౌస్ మేట్స్ అడగ్గానే "నేను ఏముంటుందిలే అనుకున్నా.. సంపి వదిలారు అసలు " అంటూ అర్జున్ చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |