![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ కి ఉండే క్రేజే వేరు. అందులోను 'ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్' కి మరీను. ఎందుకంటే ఈ సీరియల్ లో రామరాజు అలియాస్ ప్రభాకర్, వేదవతిలకి ముగ్గురు కొడుకులు. ఒక్కొక్కరు ఒక్కో టైమింగ్ తో ఫేమస్ అయ్యారు. చిన్నోడు ధీరజ్ తన భార్య ప్రేమ.. వీరిద్దరి జంటకి క్యూట్ ఆన్ స్క్రీన్ జంటగా పేరుంది. ఇక పెద్దోడు చందు భార్య శ్రీవల్లి. తను విలన్ గా లేడీ కామెడియన్ గా పేరు తెచ్చుకుంది. ఇక నడిపోడు సాగర్. అతని భార్య నర్మద. నర్మద పాత్రలో నటిస్తుంది అన్షు రెడ్డి. ఈ సీరియల్ లో ఆమె కట్టు బొట్టు చూస్తే అబ్బా భార్య అంటే ఇలా ఉండాలబ్బా అని సీరియల్ చూసేవాళ్లకి అనిపిస్తుంటుంది. ముఖ్యంగా సాగర్ని చూస్తే.. వీడు మామూలు లక్కీ కాదని కుళ్లుకుంటారు.
అన్షు రెడ్డి తన నటనతో ఒకవైపు ఆన్ స్క్రీన్ మీద మెప్పిస్తుంటే మరోవైపు పర్సనల్ లైఫ్ లో నిత్యం వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేస్తుంది. గత నెలలో అమెరికాకి వెళ్ళొచ్చిన అన్షురెడ్డి అక్కడ దిగిన ఫోటోలని తన ఇన్ స్ట్రా గ్రామ్ లో షేర్ చేసింది. అవి కాస్తా వైరల్ గా మారాయి. ఇప్పుడు తాజాగా థాయ్లాండ్ కి వెళ్ళింది అన్షు రెడ్డి. ఇక అక్కడ దిగిన ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అవి ఇప్పుడు వైరల్ గా మారాయి. అన్షురెడ్డికి ఇన్ స్టాగ్రామ్ లో 992K ఫాలోవర్స్ ఉన్నారు. ఇల్లు ఇల్లాలు సీరియల్ లో పద్ధతిగా కనపడే ఈ తెలుగింటి అమ్మాయి నటన మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.
![]() |
![]() |