![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1074 లో..... ఇందు ఐరన్ చేస్తుంటే రాజు వచ్చి ఈ షర్ట్ ఐరన్ చెయ్ అంటాడు. ఏంటి ఏదో సొంత పెళ్ళాన్ని అడిగినట్లు అడుగుతున్నావని ఇందు అనగానే ఇప్పుడు చేస్తావా చేయవా అని రాజు అంటాడు. చెయ్యనని ఇందు చెప్తుంది. సరే నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్లి చెప్తాననగానే అవసరం లేదు చేస్తానులే అని ఇందు అంటుంది. ఇందు కావాలనే రాజు షర్ట్ ని కాల్చేస్తుంది. అది రాజు చూసి నా షర్ట్ నే అలా చేస్తావా.. నీకు ఐరన్ బాక్స్ తో వాత పెడతానని రాజు అంటాడు. దాంతో ఇందు పరుగెడుతుంది. ఇందు వెనకాలే రాజు పరుగెడుతాడు.
అందరూ హాల్లో కూర్చొని ఉంటారు ఇందు హాల్లోకి వెళ్తుంది. తన వెనకాలే రాజు కూడా వెళ్తాడు. వాళ్ళు అలా సరదాగా ఉండడం చూసి.. ఉండండి.. ఉండండి ఇంకా కాసేపే మీ నవ్వులు అని భ్రమరాంబతో రేఖ అంటుంది. అప్పుడే చలపతి, లక్ష్మీ ఎంట్రీ ఇస్తారు. ఇందు, రాజు క్లోజ్ గా ఉండడం చూసి వాళ్లు షాక్ అవుతారు. మీరు ఏంటి ఇక్కడ అని రాజు అడుగుతాడు. అది సరే కానీ నువ్వు ఏంటి ఇక్కడ.. ఇందు తో కలిసి బిజినెస్ చేస్తున్నానన్నావ్ .. ఇందు బిజినెస్ పార్టనరా లైఫ్ పార్టనరా అని చలపతి అడుగుతాడు. దాంతో రాజు, ఇందు షాక్ అవుతారు. అంకుల్ అని ఇందు ఏదో చెప్పబోతుంటే నువ్వు ఆగమ్మ.. ఇది తండ్రీకొడుకులకి మధ్య సాగుతుందని చలపతి అంటాడు. నువ్వు ఇందుని పెళ్లి చేసుకున్నావా అని చలపతి అడుగుతాడు. చేసుకున్నానని రాజు చెప్తాడు. జరిగిందేదో జరిగింది విడాకులు ఇవ్వమని రాజుతో చలపతి అంటాడు. అదేంటి అలా అంటారని అపర్ణ అంటుంది. గతంలో ఏం జరిగిందో అప్పుడే మర్చిపోయారా ఆక్సిడెంట్ లో అందరు చనిపోయారు కానీ బయట వేరే అంటున్నారు. మీ గొప్పింటోళ్ల ఇంటికి నా కొడుకు అల్లుడిగా వద్దని చలపతి అంటాడు. రాజు చెయ్ పట్టుకొని చలపతి తీసుకొని వెళ్తుంటే రాజు రానని అంటాడు. నా భార్యని వదిలిరానని రాజు చెప్తాడు.
రేఖ మధ్యలో కల్పించుకొని మాట్లాడుతుంటే.. ఆపు రేఖ అని అపర్ణ అంటుంది. దాంతో చలపతి లక్ష్మీకి తనే రేఖ అని అర్థమవుతుంది. గతంలో రేఖ గురించి శృతి చెప్పింది గుర్తుచేసుకొని.. నువ్వు ఇక్కడ వద్దురా అని అంటాడు. నీకు మేం కావాలో ఇందు కావాలో తేల్చుకోమని చలపతి అంటాడు. తరువాయి భాగంలో రాజు పేరెంట్స్ వెళ్ళిపోతారు. నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదనిపిస్తుందని రాజుతో ఇందు అనగానే ఈ బంధం వదిలివెళ్ళనని రాజు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |