![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ - 266 లో.. నన్ను రోడ్ మీద నిల్చోబెట్టి నువ్వు నీ ఫ్రెండ్‌తో ముచ్చట్లు పెడుతున్నావా? అని అనామిక అనగానే.. అదేంటి అనామిక అలా అంటావ్? పాపం అప్పు ఫీల్ అవుతుందని కళ్యాణ్ అంటాడు. అంటే నీ ఫ్రెండ్ ఫీలింగ్స్ అర్థం చేసుకున్నావ్ కానీ నా ఫీలింగ్స్‌తో నీకు పనిలేదా అని అనామిక అనగానే.. అబ్బా ఇప్పుడేమైందని, కార్‌లో కూర్చోమన్నాను కదా అని కళ్యాణ్ అంటాడు. నేనేమైనా పిచ్చిదాన్ని అనుకున్నావా? ఇప్పటివరకు నా కోసమే ఎవరైన వెయిట్ చేసారు కానీ ఈరోజు నువ్వు నన్ను గంటసేపు వెయిట్ చేయించావని అనామిక అంటుంది. ఇప్పుడేమైంది అప్పుని మనతో పాటు తీసుకెళ్తాదమంటే తను రావట్లేదని కళ్యాణ్ అనగానే.. ఇప్పుడు వస్తున్నావా రావట్లేదా అని అనామిక అంటుంది. ఒక్క నిమిషం ఆగమని అనామికతో కళ్యాణ్ చెప్పి, ఇప్పుడేమైంది నాతో రావడం ఇష్టం లేదా అని అప్పుని కళ్యాణ్ అడుగగా.. నాతో రావడం ఇష్టం లేదా అని అనామిక అంటుంది. నేను అప్పుతో మాట్లాడుతుంటే మధ్యలో నువ్వేంటి అనామిక అని కళ్యాణ్ అంటాడు. సరే నీ ఫ్రెండ్ తోనే మాట్లాడుకో నేను వెళ్తున్నాని అనామిక చెప్పేసి వెళ్లిపోతుంది.
మరోవైపు రాజ్ తన గదిలో రెడీ అవుతుంటాడు. అప్పుడే కావ్య వచ్చి.. ఈ రోజు నాకోసం రెడీ అవుతున్నావని అంటుంది. నీకోసమా అది ఇంపాజిబుల్ అని రాజ్ అంటాడు. నేను చెప్పేది వెంటే మీరే ఎగురుకుంటూ వస్తారని కావ్య అంటుంది. నీతో అంటే స్వర్గానికి కూడా రానని రాజ్ అంటాడు. నేను మా అక్క బాయ్ ఫ్రెండ్ రాజ్ దగ్గరికి వెళ్తున్నాని కావ్య అంటుంది. మీ అక్క కోసం అయితే నువ్వు వెళ్ళు నేను రానని రాజ్ అంటాడు. మీరే నన్ను తీసుకొని వెళ్ళేలా చేస్తానని కావ్య ఛాలెంజ్ చేస్తుంది. ఇక కిందకి వచ్చి ధాన్యలక్ష్మి దగ్గర డ్రామా చేస్తుంది కావ్య. రాజ్ సర్ ప్రైజ్‌గా బయటకు తీసుకెళ్తున్నాడని అంటుంది. ఆ తర్వాత అపర్ణతో వెళ్లమని చెప్పేలా నటిస్తుంది కావ్య. కాసేపటికి అందరి అంగీకారంతో కావ్య, రాజ్ బయటకు వస్తారు. మరోవైపు అప్పు మౌనం వీడి అన్నం తింటు ఉండటం చూసిన కనకం సంబరిపడిపోతుంది.
అన్నపూర్ణ, కనకం మాట్లాడుకుంటారు. కళ్యాణ్ చెప్తే అప్పు తింటుంది. అదే అనామికని కళ్యాణ్ పెళ్ళి చేసుకుంటున్నాడని తెలిసి తనలో ఉన్న అప్పు ప్రేమ బయటపడిరది. అలాగే కళ్యాణ్ మనసులో ఉన్న అప్పు ప్రేమ కూడా బయటపడాలి. అలా బయటపడాలంటే నేను దుగ్గిరాల వారింటికి వెళ్ళి కళ్యాణ్ మనసుని మార్చాలని అంటుంది. నాకొక అవకాశం రావాలని అన్నపూర్ణతో అనగానే అప్పుడే కనకంకి స్వప్న ఫోన్ చేస్తుంది. నేను ప్రెగ్నెంట్ అని స్వప్న అనగానే కనకం నమ్మదు. కావాలంటే మీ ముద్దులకూతురిని అడగమని కనకంతో స్వప్న చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. మరోవైపు రాజ్, కావ్య కార్ లో వెళ్తుంటారు. అదే సమయంలో కనకం పోన్ చేసి.. ఆ దున్నపోతు కడపుతో ఉందంట కదా అని అడుగుతుంది. అది విని రాజ్ నవ్వుకుంటాడు. ఏంటి అమ్మ.. ఈ సారి నిజంగానే అక్క కడుపుతో ఉందని కావ్య అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో.. అరుణ్ దగ్గరికి రాహుల్ వెళ్తాడు. ఇప్పుడు కావ్య నీ దగ్గరికి వచ్చి, అంతా అడుగుతుందని చెప్తుంటాడు. అప్పుడే రాజ్, కావ్య ఇద్దరు కార్ లో దిగి అరుణ్ ఉన్న హాస్పిటల్‌కి వస్తారు. మరి అరుణ్ వెనకాల ఉంది రాహులే అని వాళ్ళిద్దరు తెలుసుకుంటారా? అరుణ్ నిజం చెప్తాడా లేదా తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |