Home

»

Latest News

రాశీ ఖ‌న్నా, త‌మ‌న్.. మ‌రో హిట్ కొడ‌తారా!

May 21, 2022 5:24PM

జ‌ట్టుక‌ట్టిన ప్ర‌తీ సారి హిట్టు కొట్టే కాంబినేష‌న్స్ కొన్ని ఉంటాయి. అలాంటి కాంబోస్ లో క‌థానాయిక రాశీ ఖ‌న్నా, యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ ని కూడా చెప్పుకోవ‌చ్చు. ఎందుకంటే.. తెలుగునాట ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన సినిమాల‌న్నీ మంచి విజ‌యం సాధించాయి.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. 2018 ఫిబ్ర‌వ‌రిలో రిలీజైన `తొలిప్రేమ‌` కోసం మొద‌టి సారి టీమ్ అప్ అయిన రాశి, త‌మ‌న్.. ఫ‌స్ట్ ఎటెంప్ట్ లోనే మంచి స‌క్సెస్ చూశారు. ఆపై 2019 డిసెంబ‌ర్ లో బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ అయిన `వెంకి మామ‌`, `ప్ర‌తి రోజూ పండ‌గే`తో మ‌రో రెండు విజ‌యాల‌ను సొంతం చేసుకుని.. టాలీవుడ్ లో హ్యాట్రిక్ కాంబోగా వార్త‌ల్లోకెక్కారు. క‌ట్ చేస్తే.. స్వ‌ల్ప విరామం అనంత‌రం ఇప్పుడు ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో మ‌రో చిత్రం వ‌స్తోంది. అదే.. `థాంక్ యూ`. యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా విక్ర‌మ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. జూలై 8న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. మ‌రి.. జ‌ట్టుక‌ట్టిన ప్రతీసారి హిట్టు కొడుతున్న రాశీ ఖ‌న్నా, త‌మ‌న్.. `థాంక్ యూ`తోనూ ఆ ప‌రంప‌ర‌ని కొన‌సాగించి మ‌రో స‌క్సెస్ ని క్రెడిట్ చేసుకుంటారేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com