![]() |
![]() |

మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)'వార్ 2(War 2)'తో ఫస్ట్ టైం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan)తో కలిసి ఎన్టీఆర్ చేస్తున్న ఈ మల్టిస్టారర్ చిత్రంపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ తో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి.
ఇక ఈ మూవీ ఆగస్టు 14 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. దీంతో మేకర్స్ భారీ ఎత్తున ప్రమోషన్స్ కి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు రాయల్ చాలెంజర్స్, పంజాబ్ జట్ల మధ్య జరిగే ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ లో వార్ 2 కి సంబంధించిన 'స్పెషల్ గ్లింప్స్' ని ప్రసారం చేయనున్నారని, అందులో భాగంగా హృతిక్, ఎన్టీఆర్ క్యారెక్టర్స్ కి సంబంధించిన వీడియోని ఓవర్ బ్రేక్ మధ్య ప్రసారం చేయనున్నట్టుగా బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ ఏర్పాట్లు కూడా పూర్తి చేసిందని అంటున్నారు.
మరి ఈ వార్త నిజమైతే కనుక ఎన్టీఆర్, హృతిక్ అభిమానులకి ఈ ఐపి ఎల్ ఫైనల్ మ్యాచ్ డబుల్ ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. యాక్షన్ థ్రిల్లర్ గా సుమారు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న వార్ 2 కి అయాన్ ముఖర్జీ దర్శకుడు కాగా, కియారా అద్వానీ(Kiara Advani)హీరోయిన్ గా చేస్తుంది. ఆగస్టు 14 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావడానికి ముస్తాబు అవుతుంది.
.webp)
![]() |
![]() |