![]() |
![]() |

భోళాశంకర్ పరాజయంతో ఈసారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలనే పట్టుదలతో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)'విశ్వంభర'(Vishwambhara)మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి'బింబిసార' ఫేమ్ వశిష్ట(Vasishta)దర్శకుడు కావడంతో మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. గత నెలలో 'హనుమాన్ జయంతి' రోజున విడుదలైన 'రామ రామ' సాంగ్ ఆ అంచనాలని రెట్టింపు చేసిందని చెప్పవచ్చు. యువి క్రియేషన్స్ పై పలు హిట్ చిత్రాలని నిర్మించిన విక్రమ్ రెడ్డి, ప్రమోద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా 'విశ్వంభర' ని నిర్మిస్తున్నారు.
ఈ నెల 13 నుంచి 25 వరకు ఫ్రెంచ్ రివేరాలో ఉన్న కేన్స్(Cannes)నగరంలో ప్రతిష్టాత్మకమైన'కేన్స్ ఫిలింఫెస్టివల్(Cannes Film Festival)జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఫెస్టివల్ లో 'విశ్వంభర' కి సంబంధించిన విషయాలు దాగి ఉన్న ఒక పుస్తకాన్ని విక్రమ్ రెడ్డి ఆవిష్కరించాడు. ఈ విషయాన్నీ తెలుపుతూ సోషల్ మీడియాలో నిర్మాణ సంస్థ ఫోటోలు పంచుకోవడంతో పాటు విశ్వంభర ప్రపంచం త్వరలోనే మీ ముందుకు ఒక అద్భుతాన్ని తీసుకురానుంది. ఈ పుస్తకంలో ఏం ఉందో తెలుసుకోవాలంటే వేచి ఉండండని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆ పుస్తకానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి
చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతున్న విశ్వంభరలో త్రిష(Trisha)ఆషికా రంగనాధ్, ఇషాచావ్లా, కునాల్ కపూర్, రావు రమేష్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి(keeravani)సంగీత సారధ్యం వహించగా త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.

![]() |
![]() |