![]() |
![]() |

స్వయంవరం, నువ్వేకావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు కె.విజయ్‌భాస్కర్ దర్శకత్వంలో తాజాగా మరో లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. 'ఉషా పరిణయం' అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి 'లవ్ ఈజ్ బ్యూటిఫుల్' అనేది ఉపశీర్షిక. మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె.విజయ్‌భాస్కర్ స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో శ్రీకమల్, తాన్వీ ఆకాంక్ష, సూర్య, అలీ, వెన్నెలకిషోర్, శివాజీ రాజా, ఆమని తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకి ధ్రువన్ సంగీతం అందిస్తుండగా డీఓపీగా సతీష్ ముత్యాల, ఎడిటర్ గా ఎమ్ ఆర్ వర్మ వ్యవహరిస్తున్నారు.
అప్పట్లో రచయితగా త్రివిక్రమ్ కి మాటల మాంత్రికుడు అనే పేరు రావడానికి విజయ్ భాస్కర్ సినిమాలే అని చెప్పొచ్చు. త్రివిక్రమ్ తో కలిసి ఆయన చేసిన సినిమాలు ఆల్ టైం ఎంటర్టైనర్స్ గా పేరు తెచ్చుకున్నాయి. కాస్త గ్యాప్ తర్వాత వస్తున్న విజయ్ భాస్కర్ 'ఉషా పరిణయం'తో మరోసారి మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.
![]() |
![]() |