![]() |
![]() |
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ చేసిన 67 సినిమా ‘లియో’ విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతున్న నేపథ్యంలో అతని 68వ సినిమా సెట్స్‌పైకి వచ్చింది. అక్టోబర్ 24న ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు చెన్నైలో జరిగాయి. సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న వారంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొంతున్న ఈ సినిమాను ‘బిగిల్’ చిత్రాన్ని నిర్మించిన ఎజిఎస్ సంస్థ నిర్మిస్తోంది.
ఈ సినిమా ప్రారంభమైన క్షణం నుంచే ఈ సినిమా కథ ఏమై ఉంటుందన్న చర్చ మొదలైంది. తాజాగా అందిన సమాచారం మేరకు ఈ సినిమా టైమ్ ట్రావెల్‌పై ఉంటుందని తెలుస్తోంది. టైమ్ మెషీన్ చుట్టూ ఈ కథ రన్ అవుతుందట. టైమ్ ట్రావెల్‌కి సంబంధించి ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చాయి. అయితే అందులో ఇది ఏ తరహా సినిమా అనేది తెలియాల్సి ఉంది. ఈ జోనర్‌లో వచ్చిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. మరి ఈ సినిమా విషయంలో అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
ఈ సినిమాకి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. టి సిరీస్ సంస్థ ఈ సినిమా ఆడియో హక్కులను దక్కించుకుంది. అంతేకాదు, ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా ఈ సినిమాకి ఫిక్స్ అయిపోయింది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ మొత్తానికి రైట్స్ తీసుకున్నట్టు సమాచారం.
ప్రియాంక అరుళ్ మోహన్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో స్నేహ, లైలా కీలక పాత్రలు పోషిస్తారు. ఇంకా ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్ అమీర్, జయరామ్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు.
![]() |
![]() |