Home

»

Latest News

`గాడ్ ఫాద‌ర్`లో విద్యా బాల‌న్?

Sep 21, 2021 3:19PM

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన `ఎన్టీఆర్` బ‌యోపిక్ లో.. న‌ట‌ర‌త్న నంద‌మూరి తారక రామారావు శ్రీ‌మ‌తి బ‌స‌వ తార‌కం పాత్ర‌లో అల‌రించింది విద్యా బాల‌న్. తెలుగులో త‌న‌కిదే మొద‌టి సినిమా కావ‌డం విశేషం. క‌ట్ చేస్తే.. స్వ‌ల్ప విరామం అనంత‌రం మ‌రో తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా `హ‌నుమాన్ జంక్ష‌న్` ఫేమ్ మోహ‌న‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో `గాడ్ ఫాద‌ర్` పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. మాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `లూసిఫ‌ర్` ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విద్యా బాల‌న్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని బ‌జ్. మాతృక‌లో మంజు వారియ‌ర్ న‌టించిన క్యారెక్ట‌ర్ లో విద్య ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే `గాడ్ ఫాద‌ర్`లో విద్యా బాల‌న్ ఎంట్రీపై క్లారిటీ రానుంది. మ‌రి.. బాల‌య్య‌కి జోడీగా అల‌రించిన విద్యాబాల‌న్.. చిరుకి సోద‌రి వ‌ర‌సైన పాత్ర‌లో ఏ స్థాయిలో మెస్మ‌రైజ్ చేస్తుందో చూడాలి.

కాగా, `గాడ్ ఫాద‌ర్`కి యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ బాణీలు అందిస్తున్నాడు. 2022 ప్ర‌థ‌మార్ధంలో `గాడ్ ఫాద‌ర్` థియేటర్స్ లో సంద‌డి చేసే అవ‌కాశ‌ముంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com