![]() |
![]() |

సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్ తొలిసారిగా ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. 'హిట్' ఫేమ్ శైలేంద్ర కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో.. నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో దర్శనమివ్వనున్నారు వెంకీ. ఇక ఇదే చిత్రంతో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్ధీన్ సిద్ధిఖీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా, రుహానీ శర్మ ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు.
ఇదిలా ఉంటే, ఈ రోజు (ఆగస్టు 30) 'సైంధవ్' నుంచి మరో ముఖ్య పాత్ర మానస్ ని పరిచయం చేశారు. ఈ రోల్ లో ప్రముఖ తమిళ కథానాయకుడు ఆర్య కనిపించనున్నారు. గతంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'వరుడు'లో విలన్ గా అలరించిన ఆర్య.. ఆపై అనుష్క 'సైజ్ జీరో'లో హీరోగా పలకరించారు. కట్ చేస్తే.. భారీ విరామం అనంతరం మళ్ళీ 'సైంధవ్'తో తెలుగులో నేరుగా సందడి చేయనున్నారు. మరి.. ఆర్య స్ట్రయిట్ టాలీవుడ్ మూవీస్ వర్కవుట్ కాని నేపథ్యంలో.. 'సైంధవ్'తోనైనా హిట్ అందుకుంటాడేమో చూడాలి. కాగా, క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న 'సైంధవ్' తెరపైకి రాబోతోంది.

![]() |
![]() |