Home

»

Latest News

కొర‌టాల Vs బోయ‌పాటి గొడ‌వ ముదురుతోంది

Sep 7, 2016 2:55PM

ఒక‌రి క‌థ మ‌రొక‌రి పేరుతో చ‌లామ‌ణీ అవ్వ‌డం... ర‌చ‌యిత‌ల్ని తొక్కేయ‌డం ఇండ్ర‌స్ట్రీలో మామూలే. కొంత‌మంది క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం అనే టైటిల్ కార్డ్ కోసం ర‌చ‌యిత‌ల క‌థ‌ల్ని వాడేసుకొంటుంటారు. అలాంటి ఉదంతాలు ఎన్నో. కానీ వెలుగులోకి వ‌చ్చేవి కొన్నే. ఇప్పుడు అలాంటి క‌థ‌ల క‌బ్జా వ్య‌వ‌హారం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాంతో ఇద్ద‌రు టాప్ ద‌ర్శ‌కుల మ‌ధ్య చిచ్చు రేగింది. కొర‌టాల శివ ర‌చ‌యిత‌గా ప‌నిచేస్తున్నప్ప‌టి వ్య‌వ‌హారం ఇది. దర్శ‌కుడిగా ఫామ్ లోకి వ‌చ్చాక‌.. పాత విష‌యాన్ని మ‌ళ్లీ కెలుకుతున్నాడు.

సింహా టైమ్‌లో బోయ‌పాటి శ్రీ‌ను ద‌గ్గ‌ర ప‌నిచేశాడు కొర‌టాల‌. ఆ సినిమాకి క‌థ‌, మాట‌లు అందించింది కొర‌టాలేన‌ట‌. అయితే బోయ‌పాటి శ్రీ‌నుమాత్రం.. రెండు టైటిల్ కార్డ్స్ ఇవ్వ‌ను, క‌థ‌, లేదంటే మాట‌లకు నీ పేరు వేస్తా అన్నాడ‌ట‌. `రెండూ వ‌ద్దులే` అని కొర‌టాల అల‌గ‌డం.. నిజంగానే టైటిల్ కార్డులో కొర‌టాల శివ పేరు క‌నిపించ‌క‌పోవ‌డం జ‌రిగాయి. అయితే అప్ప‌ట్లో కొర‌టాల అంటే ఎవ్వ‌రికీ తెలీదు. ఆ గొడ‌వ కూడా బ‌య‌ట‌కు రాలేదు. ఇంత‌కాలానికి పాత విష‌యాన్ని బ‌య‌ట‌కు లాగాడు కొర‌టాల శివ‌.

ఇండ్ర‌స్ట్రీలో ఇలా క‌థ‌లు దొబ్బేసేవాళ్లు చాలామంది ఉంటార‌ని, త‌న‌కు చాలా సార్లు ఈ విష‌యం అనుభ‌వంలోకి వ‌చ్చింద‌ని, సింహా క‌థ‌కూడా నాదేన‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. ఇప్పుడు కొర‌టాల‌కు మ‌ద్ద‌తుగా కొంత‌మంది ర‌చ‌యిత‌లు ఫేస్‌బుక్ , ట్విట్ట‌ర్‌ల‌లో కామెంట్స్ పెడుతున్నారు. మ‌రో వైపు బోయ‌పాటి కూడా  ఈ విష‌యంలో సీరియ‌స్ అవుతున్న‌ట్టు స‌మాచారం. ఓ ద‌ర్శ‌కుడు మ‌రో ద‌ర్శ‌కుడిపై బుర‌ద చ‌ల్లాల‌నుకోవ‌డం.. దాన్ని మీడియా ముందు ర‌చ్చ చేయ‌డం. ఇవ‌న్నీ ఉపేక్షించ‌ద‌ల‌చిన‌వి కావు. ఓ ర‌చ‌యిత శ్ర‌మ‌ని మ‌రో ద‌ర్శ‌కుడు దోచుకోవ‌డం కూడా క్ష‌మార్హం కావు. మొత్తానికి ఈ వ్య‌వ‌హారంచూస్తుంటే గొడ‌వ ముదిరేట‌ట్టే క‌నిపిస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com