Home

»

Latest News

ఇండస్ట్రీలో మరో విషాదం.. నటుడు వీరభద్రరావు మృతి!

Mar 29, 2024 1:38PM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. టీవీ సీరియల్స్‌లో, కొన్ని సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్న నటుడు వీరభద్రరావు శుక్రవారం హైదరాబాద్‌లో కన్నుమూసారు. రెండు నెలల క్రితం ప్రమాదవశాత్తూ కింద పడిపోయిన వీరభద్రరావు వెంటనే కోమాలోకి వెళ్ళిపోయారు. రెండు నెలలుగా కోమాలోనే ఉన్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు.

టీవీ ప్రేక్షకులు సుపరిచితుడైన వీరభద్రరావు దూరదర్శన్‌లోనూ, మిగతా ఛానల్స్‌లోనూ ప్రసారమైన ఎన్నో సీరియల్స్‌ నటించారు. ఆ తర్వాత చిత్రరంగ వ్రవేశం కూడా చేశారు. ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ చిత్ర రంగంలో ఆయనకు రావాల్సినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ మంచి పాత్రల్లో కనిపించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, టీవీ రంగానికి చెందిన వారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com