![]() |
![]() |

నటిగా అను ఇమ్మాన్యుయేల్ ది 12 ఏళ్ళ సినీ ప్రస్థానం. ఈ ప్రయాణంలో మలయాళం, తమిళ్, తెలుగు భాషల్లో కలుపుకుని దాదాపు 15 చిత్రాలు చేసింది అను. వీటిలో 10 తెలుగు సినిమాలుండడం విశేషం. ఎటొచ్చి.. అమ్మడికి హిట్టొచ్చి చాలా కాలమే అయింది. ఈ నేపథ్యంలో.. రాబోయే సినిమాపైనే ఆశలు పెట్టుకుంది అను. కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా నటిస్తున్న 'జపాన్'.. అను నెక్స్ట్ ప్రాజెక్ట్. రాజు మురగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. దీపావళి కానుకగా తెరపైకి రాబోతోంది.
ఇదిలా ఉంటే, అను ఇమ్మాన్యుయేల్ ఇప్పటివరకు నటించిన తమిళ చిత్రాలు మంచి ఫలితాన్నే అందుకున్నాయి. విశాల్ హీరోగా రూపొందిన 'తుప్పరివాలన్' (తెలుగులో 'డిటెక్టివ్').. అనుకి ఫస్ట్ తమిళ్ సినిమా. అది సక్సెస్ అయింది. అలాగే శివ కార్తికేయన్ కి జంటగా చేసిన 'నమ్మ వీట్టు పిళ్ళై' కూడా విజయపథంలో పయనించింది. మరి.. ఇదే సెంటిమెంట్ కొనసాగి కార్తి 'జపాన్' కూడా హిట్ అయితే.. అనుకి తమిళంలో మూడు వరుస విజయాలు దక్కినట్టే. హ్యాట్రిక్ కొట్టినట్టే. చూద్దాం.. ఏం జరుగుతుందో?
![]() |
![]() |