![]() |
![]() |

నేషనల్ క్రష్ రష్మికా మందన్న కెరీర్ లో ఎంతో ప్రత్యేకంగా నిలిచే సినిమా.. 'గీత గోవిందం'. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండకి జోడీగా రష్మిక నటించిన తొలి చిత్రమిది. ఇందులో గీతగా తన అభినయంతో అదరగొట్టింది రష్మిక. అలాగే జీవితాంతం గుర్తుండిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది.
2018 ఆగస్టు 15న పంద్రాగస్టు ప్రత్యేకంగా ప్రజల ముందుకు వచ్చిన 'గీత గోవిందం'.. ఇప్పటికీ ఎంతోమందికి ఫేవరెట్ ఫిల్మ్. ఇదిలా ఉంటే.. ఇప్పుడిదే ఆగస్టు 15కి ఆరేళ్ళ తరువాత మరో సినిమాతో పలకరించబోతోంది రష్మిక. ఆ చిత్రమే.. 'పుష్ప - ది రూల్'. 2021 డిసెంబర్ లో నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన 'పుష్ప - ది రైజ్'కి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమా.. 2024 ఆగస్టు 15న తెరపైకి రాబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. మరి.. రష్మిక ఆగస్టు 15 సెంటిమెంట్ రిపీట్ అయి.. 'గీత గోవిందం'లాగే 'పుష్ప - ది రూల్' కూడా బాక్సాఫీస్ ముంగిట వండర్స్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
కాగా, 'పుష్ప - ది రూల్'లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తుండగా.. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి బాణీలు అందిస్తున్నాడు.
![]() |
![]() |