Home

»

Latest News

బిగ్‌బాస్‌కు పోటీగా మరో రియాలిటీ షో.. హోస్ట్‌గా తేజ సజ్జా.!

Sep 29, 2026 3:11PM

బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోలకు తెలుగులో మంచి ఆదరణ ఉంది. ఈ క్రమంలో మరో కొత్త కాన్సెప్ట్‌తో రియాలిటీ షో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ‘ద ట్రైటర్స్’ షో ఇప్పుడు తెలుగులోకి వస్తోంది. ఇప్పటికే హిందీలో రెండు సీజన్లు వచ్చిన ఈ షోకు తెలుగు వెర్షన్‌లో హీరో తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో తాజాగా అధికారికంగా ప్రకటించింది.

‘ద ట్రైటర్స్ తెలుగు’లో మొత్తం 20 మంది వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు పాల్గొననున్నారు. అయితే ఇది సాధారణ రియాలిటీ షోల మాదిరిగా టాస్కులు, పెర్ఫార్మెన్స్‌లపై మాత్రమే ఆధారపడదు. ఇందులో నమ్మకం, మోసం, వ్యూహాలు, రహస్యాలు, గ్రూప్ గేమ్ ప్రధానంగా ఉంటాయి. పాల్గొనేవారిలో కొంతమంది ‘ట్రైటర్స్’గా రహస్యంగా వ్యవహరిస్తుండగా.. మిగిలిన వారు వారిని గుర్తించేందుకు ప్రయత్నించాలి. తమ అసలు గుర్తింపును బయటపడకుండా ట్రైటర్స్ గేమ్‌ను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

ఇప్పటికే విడుదలైన లాంచింగ్ ప్రోమోలో తేజ సజ్జా తనదైన శైలిలో షో గురించి ఆసక్తిని పెంచారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు సినిమాల్లో నటుడిగా కనిపించిన తేజ.. తొలిసారి ఓ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. కొత్త ఫార్మాట్, కొత్త ఎనర్జీతో ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యేందుకు ఈ షో తనకు భిన్నమైన అనుభూతిని ఇస్తోందని తేజ సజ్జా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

‘ద ట్రైటర్స్ తెలుగు’ అక్టోబర్ 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మొత్తం 10 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ షో నాలుగు వారాల పాటు ప్రసారం కానుంది. ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఎపిసోడ్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తెలుగు ఆడియోతో పాటు ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో ఈ షో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. మరి బిగ్‌బాస్ తరహాలో ఈ కొత్త రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

 

 

[The Traitors Telugu, Teja Sajja The Traitors, The Traitors Telugu OTT, Teja Sajja Reality Show, The Traitors Telugu Prime Video, Teja Sajja New Show, Telugu Reality Shows]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com