![]() |
![]() |

మీడియాకు సంబంధించి కోలీవుడ్ నిర్మాతల సంఘం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల నటుడు మారిముత్తు, హీరో విజయ్ ఆంటోని కుమార్తె మరణం వంటి వార్తలను జనంలోకి తీసుకెళ్ళే క్రమంలో వార్తా పత్రికలు, యూ ట్యూబ్ ఛానల్స్ కార్యకలాపాలు కొన్ని వివాదాలకు దారి తీసిన నేపథ్యంలో కోలీవుడ్ నిర్మాతల సంఘం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
అదేమిటంటే కోలీవుడ్ ప్రముఖుల మృతి ఘటనల్లో మీడియాను ఇకపై అనుమతించబోమని ప్రకటించింది. కుటుంబ బంధాలకు ఎంతో విలువనిచ్చే సమాజం మనది. అందరి శ్రేయస్సు కోసం నిర్మాతల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని, దీన్ని అందరూ గౌరవించాలని కోరింది. నిర్మాతల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ఆమోదాన్ని తెలిపినట్టు సమాచారం.
![]() |
![]() |