![]() |
![]() |

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడి మరణించడానికి ఆరు రోజుల క్రితం అతడి మాజీ మేనేజర్ దిశా షాలిని కూడా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆమెది ఆత్మహత్య కాదనీ... ఆమెను రేప్ చేసి మర్డర్ చేశారని సీనియర్ బీజేపీ నాయకుడు నారాయణ్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు.
సుశాంత్ ఆత్మహత్య తరవాత దిశా షాలిని మరణం వెనుక సైతం పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, నారాయణ్ రాణే వ్యాఖ్యలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. దిశా షాలిని అటాప్సీ రిపోర్టులో ఆమె లైంగిక అవయవాలపై గాయాలు ఉన్నాయని పేర్కొన్నట్టు ఆయన పేర్కొన్నారు.
సుశాంత్ ఆత్మహత్యకు, దిశా షాలిని ఆత్మహత్యకు సంబంధం ఉండకపోవచ్చని కొంతమంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దిశా తల్లి సైతం తన కుమార్తె కొన్ని రోజులే సుశాంత్ దగ్గర పని చేసిందనీ, వాళ్ళిద్దరి మరణాలకు సంబంధం లేదని అన్నారు. మరోవైపు దిశా మరణంతో సుశాంత్ బాగా కలత చెందాడని అతడి ఫ్లాట్ మేట్ సిద్ధార్థ్ పేర్కొన్నారు. అసలు విషయం ఏంటనేది విచారణలో బయటపడుతుందో లేదో చూడాలి.
![]() |
![]() |