![]() |
![]() |

తమిళ స్టార్ హీరో సూర్య వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తున్నాడా? ప్రముఖ దర్శకుడు మణిరత్నం కోసం ఆయన 'ఎస్' అన్నాడా? అవునని కోలీవుడ్ కోడై కూస్తోంది. మణిరత్నం ప్రొడక్షన్ హౌస్ మద్రాస్ టాకీస్ ప్రొడ్యూస్ చేసే 'నవసర' ఆంథాలజీ (పలు కథల సంకలనం)లో ఒక కథలో సూర్య నటిస్తున్నాడని చెన్నై టాక్. దానికి యాడ్ ఫిలింమేకర్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'నా నువ్వే'కి దర్శకత్వం వహించిన జయేంద్ర దర్శకత్వం వహిస్తారని సారాంశం.
మణిరత్నం సంస్థ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ ఆంథాలజీలో ఓ కథకు జయేంద్ర దర్శకత్వం వహిస్తున్న మాట వాస్తవమే. అయితే, ఆయన దర్శకత్వంలో సూర్య నటిస్తున్నాడనేది నిజం కాదు. ప్రస్తుతానికి ఇంకా ఏదీ ఖరారు కాలేదు. "నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వార్త (సూర్య నటిస్తున్నాడని వచ్చిన వార్తను ఉద్దేశిస్తూ) అబద్ధమే. ఓ వారం లేదా రెండు వారాల తరవాత మేం ఏదైనా చెప్పగలం" అని జయేంద్ర అన్నారు. అదీ సంగతి.
![]() |
![]() |