![]() |
![]() |

సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజే వేరు. ఎంతమంది హీరోలున్నా ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ని ఎవరూ మ్యాచ్ చేయలేరు అనడంలో సందేహం లేదు. ఈ వయసులో కూడా ఆయన స్టైల్, స్వాగ్ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఆయన నెల్సన్ దర్శకత్వంలో 'జైలర్' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ విడుదలైంది.
ఈరోజు(డిసెంబర్ 12) రజినీకాంత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూ 'జైలర్' గ్లింప్స్ ని విడుదల చేశారు. రజినీ షూ లేస్ కట్టుకొని, బాడీ స్ప్రే కొట్టుకొని, కళ్ళజోడు పెట్టుకొని స్టైలిష్ గా నడిచి వచ్చి.. కత్తిని తీసుకోవడం ఆకట్టుకుంటోంది. రజినీ స్టైలిష్ లుక్ కి తగ్గట్లు అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
![]() |
![]() |