![]() |
![]() |

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ఈ సినిమాను నిర్మించనున్నట్లు 2020 సెప్టెంబర్‌లో ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్‌పీ అనే న్యూ బ్యానర్ ఎనౌన్స్ చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్ కేన్సిల్ అయ్యిందంటూ ఇటీవల ఆన్‌లైన్‌లో ప్రచారంలోకి వచ్చింది. విజయ్ ప్లేస్‌లో రామ్‌చరణ్ వచ్చాడనేది ఆ ప్రచార సారాశం.
అయితే సుక్కు-విజయ్ ప్రాజెక్ట్ ఆగిపోయిందనడంలో ఎలాంటి వాస్తవం లేదని ఫాల్కన్ క్రియేషన్స్ నేడు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఆ ప్రచారం అవాస్తమనీ, విజయ్-సుకుమార్ కాంబో మూవీ తమ ఫస్ట్ ఫిల్మేననీ ఆ సంస్థ అధినేత కేదార్ సెలగంశెట్టి చెప్పారు. ముందుగా అనుకున్న ప్రకారమే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందనీ, 2022లో విడుదలవుతుందనీ ఆయన తెలిపారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ "లైగర్" సినిమా చేస్తున్నారు, దర్శకుడు సుకుమార్ "పుష్ప" సినిమాను తెరకెక్కిస్తున్నారు. వీళ్లిద్దరి కమిట్మెంట్స్ అయిన వెంటనే విజయ్ - సుకుమార్ చిత్రం ప్రారంభం కానున్నట్లు నిర్మాణ సంస్థ తాజా ప్రెస్ నోట్ లో వెల్లడించింది. ఈ క్రేజీ సినిమాను మరింత ప్రతిష్ఠాత్మకంగా, భారీ స్థాయిలో తెరకెక్కిస్తామని ఫాల్కన్ క్రియేషన్స్ తెలిపింది.

![]() |
![]() |