![]() |
![]() |

కంగనా రనౌత్ ఒక పెళ్లి వేడుకలో మెరిసిపోయారు. ఆమె నుంచి చూపు తిప్పుకోవడం చాలామందికి సాధ్యం కాలేదు. ఇంతకీ పెళ్లి ఎవరిదనుకుంటున్నారు!.. ఆమె సోదరుడు అక్షిత్ రనౌత్‌ది. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అక్షత్, రీతు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో కంగన స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. తమ్ముడి పెళ్లికి పెద్దలా వ్యవహరించారు. కంగన ఫ్యామిలీ, పెళ్లి కుమార్తె ఫ్యామిలీతో పాటు సమీప బంధువులు ఈ వేడుకకు హాజరయ్యారు. వధూవరులతో కలిసి కంగన దిగిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.
.jpg)
తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్ ద్వారా సోదరుని పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేశారు. ఒక పిక్చర్‌లో వధూవరుల మధ్య నిల్చొని బిగ్గరగా నవ్వుతున్న కంగన కనిపిస్తే, ఇంకో పిక్చర్‌లో సోదరునికి తలపాగా పెడుతున్న కంగన కనిపించారు. అక్క రంగోలి చద్దేలితో ఓ ఫొటో, అమ్మ-అక్కతో ఇంకో ఫొటో.. ఇలా పలు ఫొటోల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ ఆమే. ఈ వేడుకలో ఆమె ధరించిన డ్రస్ కూడా అనేకమందిని ఆకట్టుకుంది. దాని గురించి కామెంట్ల సెక్షన్లలో పలువురు ఆమెను అడిగారు. దీనికి సమాధానం ఇచ్చారు కంగన.
.jpg)
"నా లెహంగా గురించి అందరూ అడుగుతున్నారు. ఇది గుజరాతీ బంధని లెహంగా. దీన్ని తయారుచేయడానికి 14 నెలల సమయం పట్టింది. డిజైనర్ అనూరాధ వాల్మీకి ఈ కలను నిజం చేశారు. జ్యూయలరీని నా ఫ్రెండ్ సవ్యసాచి డిజైన్ చేశారు" అని తెలిపారు కంగన.
.jpg)
.jpg)
.jpg)
.jpg)
![]() |
![]() |