![]() |
![]() |

‘బలగం’ సినిమాతో సంచలనం సృష్టించిన నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్స్. ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తోన్న లేటెస్ట్ సినిమా ‘ఆకాశం దాటి వస్తావా’. ఈ సినిమాతో యంగ్ కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయం అవుతున్నాడు. మలయాళ నటి కార్తీక మురళీధరన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
‘ఆకాశం దాటి వస్తావా’తో శశి కుమార్ ముతులూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇదొక మ్యూజికల్ డాన్స్ బేస్డ్ లవ్ స్టోరి. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్ ‘ఉన్నానో లేనో’ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ మెలోడీగా రూపొందించిన సెకండ్ సింగిల్ 'శృంగార' పాటను విడుదల చేశారు మేకర్స్.
కార్తీక్ స్వరపరిచిన ఈ శృంగార పాటను సంజిత్ హెగ్డే, మాళవికా శంకర్ ఆలపించారు. దర్శకుడు శశి కుమార్ ముతులూరి ఈ సాంగ్ రాయడం విశేషం. ఇందులో హీరో హీరోయిన్లు యష్, కార్తీక మురళీధరన్ మధ్య కెమిస్ట్రీ అందంగా ఉంది. ప్రేమ జంట మధ్య ఎటువంటి అవధులు లేని స్వచ్ఛమైన రొమాన్స్ ఈ పాటలో చూపించారని చెప్పాలి. మొదట వాళ్లిద్దరిని చూపించి... ఆ తరువాత నెమ్మదిగా వాళ్ళ రొమాంటిక్ ప్రపంచంలోకి తీసుకువెళ్లాడు దర్శకుడు.
శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'బలగం' తర్వాత వాళ్ళిద్దరూ నిర్మిస్తున్న చిత్రమిది.
![]() |
![]() |