Home

»

Latest News

శేఖర్‌ మాస్టర్‌కి హీరోయిన్‌ శ్రీలీల క్షమాపణ లేఖ

Aug 28, 2023 11:16AM


కన్నడ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన శ్రీలీల అక్కడ ఓ అరడజను సినిమాలు చేసేసింది. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా హీరోయిన్‌గా మంచి పేరే తెచ్చుకుంది. పెళ్లిసందడి, ధమాకా చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ఆమె డాన్సుకు ఆడియన్స్‌ ఫిదా అయిపోయారు. స్వతహాగా క్లాసికల్‌ డాన్సర్‌ అయిన శ్రీలీల తన టాలెంట్‌తో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటోంది. తాజాగా రామ్‌, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘స్కంద’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. దసరా కానుకగా ఈ సినిమా సెప్టెంబర్‌ 15న విడుదల కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో తన మనసులోని కొన్ని భావాలను పంచుకుంది. తాను చిన్నతనం నుంచి డాన్స్‌ నేర్చుకుంటున్నప్పటికీ ఒక సినిమాలోని పాట కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని, 30 టేకులు తీసుకుంటే తప్ప ఆ పాట ఓకే అవ్వలేదని తెలిపింది. ఆ పాటకు శేఖర్‌ మాస్టర్‌ డాన్స్‌ కంపోజ్‌ చేశారు. షూటింగ్‌ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్ళి శేఖర్‌ మాస్టర్‌కి 3 పేజీల క్షమాపణ లేఖ రాసిందట. దానికి స్పందించిన శేఖర్‌ మాస్టర్‌ ఆమెకు ఫోన్‌ చేసి ఎక్కువ టేకులు తీసుకోవడంలో నువ్వు చేసిన తప్పు ఏమీ లేదని, ఎక్కువ మంది డాన్సర్లు ఉండడం వల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో వారు సరిగా చెయ్యకపోవడం వల్లే 30 రీటేక్స్‌ అయ్యాయని చెప్పడంతో శ్రీలీల ఆ గిల్టీ ఫీలింగ్‌ నుంచి బయటపడిరదట.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com