ఎంత చూసినా చూడబుద్దేసే బొద్దుగుమ్మ యాంకర్ శ్రీముఖి.. ఎప్పుడూ చిన్నపిల్లలా ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటుంది. బుల్లి తెర మీద ఎప్పుడు సందడి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ నిలువెత్తు అందం బుర్జ్ ఖలీఫాతో పోటీ పడుతూ అందాల విందు చేస్తోంది. బ్లాక్ డ్రెస్ లో బొమ్మ అద్దిరిపోయింది. షార్ట్ షాట్ తో గ్లామర్ డోస్ పెంచేసి ఆ ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసి కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేసేస్తోంది. టీవీ షోస్ తో బిజీగా ఉండే శ్రీముఖి ఇప్పుడు తన వెకేషన్ ని మస్త్ ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా శ్రీముఖి తన అందాలతో పాటు బుర్జ్ ఖలీఫా అందాలను కూడా ఆడియన్స్ తో షేర్ చేసుకుంది. రకరకాల లొకేషన్స్ ని షేర్ చేస్తూ వావ్ అనిపించేలా విజువల్ ట్రీట్ అందిస్తోంది. ఇప్పుడు ఈ కొత్త పిక్స్ తో సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది శ్రీముఖి.
ఇప్పుడు శ్రీముఖి 'జాతిరత్నాలు', 'సరిగమప' వంటి షోస్ కి హోస్ట్ గా చేస్తోంది. మొన్నటివరకు కామెడీ స్టార్స్ షోకి యాంకరింగ్ చేసింది. ఐతే ఇప్పుడు ఆమె ప్లేస్ లో దీపికా పిల్లి అనే మరో యాంకర్ వచ్చి చేరింది. ఇవే కాదు.. మూవీస్ లో అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటుంది. నితిన్ మూవీ 'మాస్ట్రో'లో కనిపించి సందడి చేసింది. ఇప్పుడు చిరంజీవి 'భోళా శంకర్'లో నటించబోతోంది. ఐతే టీవీ షోస్, మూవీస్ తో మరో పక్క వెకేషన్స్ తో ఫుల్ బిజీగా ఉంది ఈ బొద్దు బేబీ. ఇప్పుడు మంచి హైప్ రావాలంటే సెలెబ్స్ అంతా ఎంచుకుంటున్న మార్గం సోషల్ మీడియా. అందులో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటోంది శ్రీముఖి.