![]() |
![]() |

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగవుతోంది. సైగలు చేయడం దగ్గర్నుంచి వ్యాయామం చేయడం వరకూ ఆయన వచ్చారు. అవయవాల పనితీరు కూడా మెరుగవుతోందని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ చెప్పారు. ఇదీ ఎస్పీబీ అభిమానులు కోరుకుంటున్నది. అందుకని, వాళ్ళకు ఇదీ అసలైన శుభవార్త.
తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి అప్పుడప్పుడూ ఎస్పీ చరణ్ అప్‌డేట్స్ ఇస్తున్నారు. తాజాగా మంగళవారం ఆయన ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘నాన్నగారి ఆరోగ్యం మరింత మెరుగైంది. ఊపిరితిత్తుల పనితీరు మరింత మెరుగుపడినట్టు ఎక్స్‌రేలో కనిపించింది. ఇప్పుడు 20 నిమిషాల పాటు కూర్చుని వ్యాయామాలు చేస్తున్నారు. ఫిజియోథెరపిస్టులు ఆయనతో దగ్గరుండి వ్యాయామాలను చేయిస్తున్నారు’’ అని ఎస్పీ చరణ్ పేర్కొన్నారు.
ఎస్పీబీ కోలుకోవాలని ప్రతిరోజూ పలువురు పూజలు, ప్రార్థనలు చేయిస్తున్నారు. ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుండి బయటకొస్తారని ఆశిస్తున్నారు.
![]() |
![]() |