Home

»

Latest News

శ్రుతి.. ఈ సారి సెకండాఫ్ టార్గెట్!

Jan 19, 2022 1:21PM

ఒక ద‌శ‌లో వ‌రుస విజ‌యాల‌తో టాక్ ఆఫ్ టాలీవుడ్ అయింది చెన్నై పొన్ను శ్రుతి హాస‌న్. మ‌ధ్య‌లో కాస్త స్పీడ్ త‌గ్గించినా.. గ‌త ఏడాది మ‌రోసారి త‌న హ‌వా చాటుకుందీ టాలెంటెడ్ యాక్ట్ర‌స్. మాస్ మహారాజా ర‌వితేజ‌కి జంట‌గా న‌టించిన `క్రాక్`, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి జోడీగా సంద‌డి చేసిన `వ‌కీల్ సాబ్`తో త‌న ఖాతాలో రెండు సాలిడ్ హిట్స్ ని క్రెడిట్ చేసుకుంది శ్రుతి హాస‌న్. ఈ రెండు కూడా 2021 ఫ‌స్టాఫ్ లోనే థియేట‌ర్స్ లో ఎంట‌ర్టైన్ చేశాయి.

Also Read:  ఈ స‌మాజం రేపిస్టుల‌ని ప్రేమిస్తోంది

క‌ట్ చేస్తే.. 2022లో అందుకు భిన్నంగా సెకండాఫ్ లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది శ్రుతి హాస‌న్. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా `కేజీఎఫ్` కెప్టెన్ ప్ర‌శాంత్ నీల్ రూపొందిస్తున్న `స‌లార్`లో హీరోయిన్ గా న‌టిస్తున్న శ్రుతి.. స‌ద‌రు సినిమాతో 2022 ద్వితీయార్ధంలో ప‌ల‌క‌రించ‌నుంది. ఇక త‌న ల‌క్కీ కెప్టెన్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న ఆడిపాడ‌నున్న `ఎన్.బి.కె. 107` కూడా ఈ ఏడాది సెకండాఫ్ లోనే వినోదాలు పంచ‌నుందని స‌మాచారం. సో.. 2022 సెకండాఫ్ టార్గెట్ గా శ్రుతి హాస‌న్ నెక్స్ట్ వెంచ‌ర్స్ రాబోతున్నాయ‌న్న‌మాట‌. మ‌రి.. ఆయా చిత్రాల‌తో శ్రుతి ఎలాంటి ఫ‌లితాల‌ను స్కోర్ చేస్తుందో చూడాలి. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com