![]() |
![]() |

కమెడియన్ గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి.. ఓ వైపు కమెడియన్ గా సినిమాలు చేస్తూనే, మరోవైపు హీరోగానూ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే 'సప్తగిరి ఎక్స్ ప్రెస్', 'సప్తగిరి ఎల్.ఎల్.బి', 'వజ్ర కవచదర గోవింద' వంటి సినిమాలతో అలరించిన సప్తగిరి.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు.
సప్తగిరి, నేహా సోలంకి జంటగా కె.ఎం.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'గూడుపుఠాణి'. ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను చాలా గ్రిప్పింగ్ గా తెరకెక్కించామని, ఈ సినిమాతో సప్తగిరి హీరోగా మెప్పించడం ఖాయమని మూవీ టీమ్ చెబుతోంది.

'పలాస' సినిమాతో నటుడిగా మెప్పించిన మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె.. మరోసారి తన విలనిజంతో మెప్పించబోతున్నాడు. ఈ సినిమాకి ప్రతాప్ విద్య సంగీతం అందిస్తున్నాడు.
![]() |
![]() |