Home

»

Latest News

కులాంతర వివాహాల గురించి సాయి పల్లవి కామెంట్స్

Sep 24, 2024 2:21PM

 

సాయి పల్లవి(sai pallavi)ప్రస్తుతం హిందీలో రామాయణ్ తో పాటు నాగచైతన్యతో తండేల్(thandel)లాంటి బిగ్గెస్ట్ ప్రాజక్టులను చేస్తు బిజీగా ఉంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఆ రెండు చిత్రాలు  సాయి పల్లవి చేరికతో మరింత ప్రెస్టేజియస్ట్ మూవీస్ గా  కూడా  ప్రాచుర్యం పొందాయనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.  అంతలా సాయి పల్లవి తన నటనతో ఆకట్టుకుంటూ వస్తుంది. 

గతంలో సాయి పల్లవి సోషల్ మీడియా వేదికగా కులాంతర వివాహాల గురించి  కొన్ని కామెంట్స్ చేసింది. నా చిన్నతనంలో మన కమ్యూనిటీలోనే వివాహం చేసుకోవాలని చెప్పేవారు. కానీ ఆ తర్వాత  అలా చెప్పినవారే కమ్యూనిటీని దాటి వేరే వ్యక్తులను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటున్నారు. కాకపోతే వాళ్ళు పెళ్లి చేసుకున్నాక మాత్రం తమ ప్రాంతంలో నివసించడం లేదు. పైగా ఏదైనా వేడుకలు జరిగినప్పుడు గాని ఎవరైనా మరణించినప్పుడు చేసే అంత్యక్రియలకు కూడా 
 వాళ్ళని  రానివ్వరని చెప్పుకొచ్చింది. 

ఇప్పుడు రీసెంట్ గా ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సాయి పల్లవి విషయంలో భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. సాయి పల్లవి ఇంత ఇదిగా కులాంతర వివాహాల గురించి చెప్తుందంటే తను ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు కుదిర్చిన పెళ్లే చేసుకుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ జరిగిన  సాయి పల్లవి చెల్లెలి పెళ్లి కూడా పెద్దలు కుదిర్చిందే అని అంటున్నారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com