![]() |
![]() |

రష్మికా మందన్నా తెలుగులో స్టార్ హీరోయిన్. ఒక్కో సినిమాకి సుమారు కోటి రూపాయలు పారితోషికం అందుకుంటున్నారని టాక్. అటువంటి అమ్మాయికి చీపుగా షాంపూలు కొట్టేసే అలవాటు ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. నమ్మశక్యంగా లేనప్పటికీ నిజమిది.
హోటల్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడ షాంపూలు నచ్చితే దొంగిలిస్తానని రష్మిక చెప్పుకొచ్చారు. ఓసారి తలగడ దిండు కవర్లు కూడా కొట్టేశానని ఆమె అన్నారు. అప్పుడు ఆ పని చేసినందుకు ఇప్పుడు అపరాధ భావంతో ఉన్నానని రష్మిక అన్నారు. కొంతమందికి ఇటువంటి అలవాట్లు ఉండటం సహజమేనని కొందరు నెటిజన్లు అనుకుంటున్నారు. మరికొందరు రష్మికకు అదేం పాడుబుద్ది అని సెటైర్లు వేస్తున్నారు. ఒక్క విషయంలో మాత్రం రష్మికను మెచ్చుకోవాలి... నిజాయతీగా అసలు విషయం చెప్పినందుకు!
ప్రతిదానికీ ఎక్కువ ఆలోచించడం, నవ్వుతూ ఉండటం, కొన్ని విషయాల్లో బాధపడటం తనలో తనను నచ్చని అలవాట్లు అని రష్మికా మందన్నా తెలిపారు. ఒకవేళ తనకు సూపర్ పవర్ వస్తే... ఒక్క చిటికేస్తే ఎవరేం కోరుకున్నా జరిగే పవర్ ఉంటే కోరుకుంటానని రష్మికా మందన్నా అన్నారు.
![]() |
![]() |