![]() |
![]() |

హిట్ సినిమాలే నాలుగు వారాలకు ఓటీటీలో దర్శనమిస్తున్న ఈ రోజుల్లో ఫ్లాప్ సినిమా 'రామబాణం' మాత్రం నాలుగు నెలలైనా ఓటీటీలోకి రాలేదు. మొదట్లో ఈ సినిమా ఓటీటీలోకి వస్తే చూద్దామని అంతోఇంతో ఎదురుచూసిన ప్రేక్షకులు.. ఆ తర్వాత అసలు ఆ సంగతే మర్చిపోయారు కూడా. అయితే ఎట్టకేలకు 'రామబాణం' ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం కుదిరింది.
'లక్ష్యం', 'లౌక్యం' వంటి సూపర్ హిట్స్ తర్వాత గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మే 5న థియేటర్లలో విడుదలైంది. గోపీచంద్, శ్రీవాస్ కాంబోలో హ్యాట్రిక్ హిట్ అవుతుంది అనుకుంటే.. ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయినప్పటికీ ఏవో కారణాల వల్ల ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ లేట్ అయింది. 'రామబాణం' డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 14 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
![]() |
![]() |